iDreamPost

టెస్లా సంచలన నిర్ణయం.. 2 మిలియన్లకు పైగా కార్ల రీకాల్

టెస్లా అంటేనే ఎలక్ట్రికల్ కార్స్.. ఎలక్ట్రికల్ కార్స్ అంటేనే టెస్లా అనేలా మారింది. ప్రపంచ కుబేరుడు, ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ దీనికి అధినేత అనే సంగతి విదితమే. ఇప్పుడు ఈ సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంంది. అదేంటంటే..?

టెస్లా అంటేనే ఎలక్ట్రికల్ కార్స్.. ఎలక్ట్రికల్ కార్స్ అంటేనే టెస్లా అనేలా మారింది. ప్రపంచ కుబేరుడు, ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ దీనికి అధినేత అనే సంగతి విదితమే. ఇప్పుడు ఈ సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంంది. అదేంటంటే..?

టెస్లా సంచలన నిర్ణయం.. 2 మిలియన్లకు పైగా కార్ల రీకాల్

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికాలో విక్రయించిన దాదాపు అన్ని ఎలక్ట్రికల్ కార్లను రీకాల్‌ చేసింది. ఇవి సుమారు 2 మిలియన్స్ (20 లక్షలు) పైగా ఉంటాయి. అయితే దీనిని యూఎస్ ఆటో సేఫ్టీ రెగ్యులేటర్ల ద్వారా.. రెండు సంవత్సరాల పరిశోధన అనంతరం ఎలోన్ మస్క్ యాజమాన్యంలోని టెస్లా తన వాహనాలను రీకాల్ చేయాలని నిర్ణయించుకుంది. అయితే దీనిని యూఎస్ ఆటో సేఫ్టీ రెగ్యులేటర్ల ద్వారా.. రెండు సంవత్సరాల పరిశోధన అనంతరం ఎలోన్ మస్క్ యాజమాన్యంలోని టెస్లా తన వాహనాలను రీకాల్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ తీవ్ర నిర్ణయానికి కారణం..ఆటోపైలట్ మోడ్‌కు సంబంధించిన ప్రమాదాలు. అంటే.. ఆటోపైలట్ విధానాన్ని ఉపయోగించేటప్పుడు డ్రైవర్ల అప్రమత్తతను పర్యవేక్షించేందుకు ఉద్దేశించిన సిస్టమ్ లో తలెత్తిన లోపాన్ని సరి చేసెందుకు, సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేసెందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది.

ఈ క్రమంలోనే 2012 అక్టోబర్‌ 5 మొదలు ఈ ఏడాది డిసెంబర్‌ వరకు ఉత్పత్తి చేసిన వై, ఎస్, 3, ఎక్స్‌ మోడల్స్‌ వీటిలో ఉన్నాయి. 2015 ముగింపులో ఆటోపైలట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి అమెరికాలో విక్రయించిన దాదాపు అన్ని టెస్లా కార్లను రీకాల్ చేస్తుంది. భద్రతా నియంత్రకాల సమాచారం ప్రకారం.. ఆటోపైలట్ మోడ్‌తో కనుగొన్న ఇష్యూస్ పరిష్కరించడానికి కార్ల సంస్థ సాఫ్ట్‌వేర్ అధునీకరించేందుకు వెనక్కు తీసుకున్నట్లు తెలిపింది. నేషనల్ హైవే సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం.. ఆటోపైలట్ సామర్థ్యంలో లోపాలు బయటపడ్డాయి. అలాగే ఫీచ్ దుర్వినియోగం అవుతుందన్న ఆందోళన నెలకొంది. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లో అదనపు నియంత్రణలు కూడా చేర్చడం జరిగింది. తన డ్రైవింగ్ బాధ్యతలను అనుసరించమని డ్రైవర్‌ను ఎవరు ప్రోత్సహిస్తూనే ఉంటారు. కొన్ని కార్లకు సంబంధించిన అప్‌డేట్ మంగళవారం నాడు పంపిచడం జరిగింది. మిగిలినవి కూడా త్వరలో పంపించడం జరుగుతుందని సంస్థ తెలిపింది.

ఆటోపైలట్ ఆటోమేటిక్‌గా స్టీరింగ్‌ను నిర్వహించగలదు. వేగాన్ని పెంచుతుంది. దాని లేన్‌లో బ్రేక్‌లను కూడా స్వతహాగా వేసుకుంటుంది. కానీ ఇక్కడ డ్రైవర్‌కు సహాయం చేయడానికి ఆటోపైలట్ మోడ్ పనిచేస్తుంది. అయితే ప్రస్తుతం రీకాల్ చేసిన కార్లలో ఇది పూర్తిగా కారును నడపగల సామర్థ్యం లేదు. డ్రైవర్లు మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం లేదా వెనుక సీటుపై కూర్చొని వాహనాలు నడుపుతున్నట్లు విచారణలో తేలింది. ఈ నేపథ్యంలోనే అక్టోబర్‌లో టెస్లా 54,676 యూనిట్లను రీకాల్ చేయాలని నిర్ణయించింది. ఈ లోపాన్ని పరిష్కరించడానికి, కంపెనీ ఓవర్-ది-ఎయిర్ (OTA) సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను విడుదల చేసింది. మరి, టెస్లా ఎలక్ట్రిక్ కార్లు రికాల్ చేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి