A girl From Pune Fell Into Valley While Taking Selfie Rescued: సెల్ఫీ తీసుకుంటూ 150 అడుగుల లోయలోకి.. యువతిని కాపాడిన వీడియో వైరల్!

సెల్ఫీ తీసుకుంటూ 150 అడుగుల లోయలోకి.. యువతిని కాపాడిన వీడియో వైరల్!

A girl From Pune Fell Into Valley While Taking Selfie Rescued: సెల్ఫీ సరదాలో యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు చాలానే చూశాం. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. తాజాగా ఒక యువతి సెల్ఫీ కోసం ప్రయత్నం చేసి 150 అడుగుల లోయలో పడిపోయింది.

A girl From Pune Fell Into Valley While Taking Selfie Rescued: సెల్ఫీ సరదాలో యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు చాలానే చూశాం. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. తాజాగా ఒక యువతి సెల్ఫీ కోసం ప్రయత్నం చేసి 150 అడుగుల లోయలో పడిపోయింది.

ఇవాళ్టి రోజుల్లో సోషల్ మీడియాలో ఫేమస్ కావండ కోసం యువత లేనిపోని పనులు చేసి.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ సెల్ఫీల సరదాలో ఇప్పటికే చాలామంది ప్రాణాలు కోల్పోయారు. తరచూ అలాంటి ఘటనలు, వార్తలు చూస్తున్నా కూడా కొంతమందిలో ఎలాంటి మార్పు రావడం లేదు. సెల్ఫీల సరదాలో ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాకుండా.. మిగిలిన వారిని కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఇదిగో అచ్చం ఈ అమ్మాయిలాగానే. ఆమె కూడా సెల్ఫీ కోసం పిచ్చ ప్రయత్నాలు చేసి 150 అడుగుల లోయలో పడిపోయింది. ఇంకేముంది ఆమెను ప్రాణాలతో కాపాడేందుకు రెస్క్యూ టీమ్ తల ప్రాణాలు తోకలోకి వచ్చాయి.

మహారాష్ట్ర, సతారా జిల్లా, బోర్నె ఘాట్ వద్దకు టూరిస్టులు వస్తూ ఉంటారు. అలాగే ఇవాళ కొందరు యువతీ, యువకులు వచ్చారు. వాళ్లంతా ఒక లోయలో సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించారు. వారిలో ఒక యువతి అనుకోకుండా బురదలో కాలేసింది. ఇంకేముంది.. పట్టుతప్పి వెంటనే 150 అడుగుల లోతు ఉన్న లోయలోకి పడిపోయింది. ఆమె అంత లోతుకు వెళ్లినా కూడా ఆమె ప్రాణాలతోనే ఉండటం అదృష్టం. అలాగే ఆ లోయ నిట్ట నిలువుగా ఉండుంటే.. ఆమె బతకడం కష్టం అయ్యేది. కానీ, ఆ లోయ ఏటవాలుగా ఉండటంతో.. ఆ యువతి ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన జరిగిన ప్రదేశానికి దగ్గర్లోనే రెస్క్యూ టీమ్ ఉండటంతో.. ఆ యువతిని కాపాడి పైకి తీసుకొచ్చారు.

ప్రస్తుతం ఆ యువతిని కాపాడిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆమెను ఒక వ్యక్తి తాడు సాయంతో పైకి తీసుకురావడం కనిపిస్తోంది. అయితే ఆమె అప్పటికీ షాక్ లోనే ఉంది. బాధతో కేకలు వేయడం వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియో చూసిన వాళ్లు.. ఆమె ఎంతో లక్కీ అంటా కామెంట్ చేస్తున్నారు. ఆ లోయ ఏటవాలుగా ఉండటం, దగ్గర్లోనే రెస్క్యూ టీమ్ ఉండటంతో ఆమె ప్రాణాలతో బయట పడింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఆ యువతి ప్రాణాలతో బయటపడ గలిగింది కాబట్టి ఓకే. లేదంటే ఇప్పుడు ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారేది. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు ఈ ప్రదేశానికి వెళ్లినట్లు చెబుతున్నారు. సెల్ఫీ తీసుకుంటూ యువతి లోయలో పడటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments