సాధారణంగా తల్లిదండ్రులు చేపట్టిన వృత్తినే ఎక్కువగా పిల్లలు కూడా చేపడుతూ ఉంటారు. ఇక ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా సినిమా ఇండస్ట్రీలో ఉంటాయి. స్టార్ హీరోల వారసులు తమ తండ్రి లేదా తల్లి వారసత్వాన్ని కొనసాగిస్తూ.. ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ ఉంటారు. తాజాగా తమిళ హీరో దళపతి విజయ్ కొడుకు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు. ఏకంగా భారీ చిత్రాలు నిర్మించే లైకా ప్రొడక్షన్స్ ద్వారా పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే 23 ఏళ్ల జేసన్ సంజయ్ తన తండ్రిలా హీరోగా మారతాడు అనుకుంటే.. డైరెక్టర్ గా మారి అందరికి షాకిచ్చాడు. హీరో అవుతాడు అనుకున్న కొడుకు కాస్తా డైరెక్టర్ గా మారాడు.
దళపతి విజయ్.. కోలీవుడ్ స్టార్ హీరో అయినప్పటికీ అతడికి టాలీవుడ్ లోనూ క్రేజ్ ఉంది. పలు డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగులో సైతం అభిమానులను సంపాదించుకున్నాడు విజయ్. ప్రస్తుతం లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘లియో’ శరవేగంగా పూర్తి కావొస్తుంది. ఇదంతా కాసేపు పక్కన పెడితే.. దళపతి విజయ్ కొడుకు జేసన్ సంజయ్ డైరెక్టర్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. విజయ్ కు ఇద్దరు పిల్లలు కాగా.. అందులో జేసన్ సంజయ్ పెద్దవాడు. కేవలం 23 సంవత్సరాలు ఉన్న సంజయ్.. తమిళంలో భారీ చిత్రాలను నిర్మించే ప్రొడక్షన్ హౌస్ అయిన ‘లైకా’ ప్రొడక్షన్స్ లో ఓ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు.
ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. దీంతో ఈ విషయం కాస్త బయటపడింది. జేసన్ సంజయ్ హీరో అవుతాడని అందరు అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. మెగా ఫోన్ పట్టుకుని తన ఫస్ట్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసి.. అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. కాగా.. తండ్రిలానే హీరోగా మారతాడని అందరూ అనుకున్నారు. ‘ఉప్పెన’ తమిళ రీమేక్ తో నటుడిగా మారతాడని జేసన్ సంజయ్ పై అప్పట్లో తెగ రూమర్స్ వచ్చాయి. వాటన్నింటికి తాజాగా చెక్ పెట్టాడు ఈ కుర్ర డైరెక్టర్. గతంలో ‘వెట్టైకారన్’ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తండ్రితో కలిసి నటించాడు జేసన్ సంజయ్. మరి అందరికి షాకిస్తూ.. హీరో కాకుండా డైరెక్టర్ గా జేసన్ సంజయ్ ఎంట్రీ ఇవ్వడం, అలాగే భవిష్యత్ లో కొడుకు డైరెక్షన్ లో తండ్రి సినిమా చేస్తాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదికూడా చదవండి: వీడియో: అమృత ప్రణయ్ తో హీరో కార్తికేయ లవ్లీ డాన్స్!