జైలర్ HD ప్రింట్ లీక్! సోషల్ మీడియాలో విజయ్ పై ట్రోల్స్!

జైలర్.. గత 19 రోజులుగా వరల్డ్ వైడ్ గా ఈ పేరు మారు మోగుతోంది. రజినీకాంత్– నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో వచ్చిన ఈ యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామాకి యావత్ ప్రపంచం ఫిదా అయిపోయింది. ఓవర్సీస్ లో కూడా కోట్ల వర్షం కురిసింది. ఇప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది. ఇది కదా రజినీకాంత్ స్టామినా అంటూ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నారు. అయితే రజినీ ఫ్యాన్స్ కు ఒక షాక్ తగిలింది. జైలర్ సినిమా హెచ్ డీ ప్రింట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ విషయంపై ఫ్యాన్ వార్ కూడా నడుస్తోంది.

జైలర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత పాన్ ఇండియా లెవల్లో మరే సినిమా పేరు వినిపించడం లేదు. రూ.600 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి.. ఇంకా బాక్సాఫీస్ వద్ద జైలర్ మూవీ రికార్డులు క్రియేట్ చేస్తోంది. రిలీజ్ అయిన కేవలం 19 రోజులకే జైలర్ హెచ్ డీ ప్రిట్ పైరసీ కావడంతో రజినీ ఫ్యాన్స్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో కూడా ఈ సినిమా రిలీజ్ కాలేదు. ఓటీటీ పార్టనర్స్ కు ఇది భారీ నష్టాలను తీసుకొచ్చే అంశమే. అయితే ఈ మూవీ లీక్ పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోల్స్, డిస్కషన్స్ కూడా నడుస్తున్నాయి. సినిమా హెచ్ డీ ప్రింట్ మాత్రమే కాకుండా మంచి ఆడియో క్వాలిటీ, సబ్ టైటిల్స్ తో నీట్ ప్రింట్ రావడంతో ఇది బాగా దగ్గరి వారు చేసిన పనే అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పైరసీ అంశంపై సినిమా టీమ్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

మరోవైపు హీరో విజయ్ పై కూడా సోషల్ మీడియాలో ఫుల్ ట్రోలింగ్ నడుస్తోంది. సినిమా విడుదలకు ముందు విడుదల నుంచి కూడా తమిళనాట రజినీకాంత్– విజయ్ ఫ్యాన్స్ మధ్య వార్ బాగా నడుస్తోంది. ఈ పైసరీ నేపథ్యంలో అవతలి వారిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పైరసీని వారికి అంటగడుతూ నెట్టింట పోస్టులు పెట్టడం, ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. చాలా మంది ఈ పైసరీ లింక్స్ ని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేస్తూ ప్రచారం చేస్తున్నారు. ఈ మొత్తం ఘటనలపై రజినీకాంత్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కారణం ఎవరైనా కూడా పైసరీ అనేది ఇండస్ట్రీని దెబ్బతీస్తుంది. దీని వల్ల నిర్మాతలు, డిస్టిబ్యూటర్లు ఎంతగానో నష్టపోతారు. ప్రజలు కూడా పైరసీని ఎంకరేజ్ చేయద్దంటూ ఇండస్ట్రీలు ఎప్పటి నుంచి అవగాహన కల్పిస్తూనే ఉంది. అధికారులు, పోలీసులు సైతం పైరసీ కట్టడికి కృషి చేస్తున్నారు.

Show comments