‘జైలర్’ మూవీకి షాకిచ్చిన ఢిల్లీ హైకోర్ట్!

  • Author Soma Sekhar Published - 08:05 PM, Mon - 28 August 23
  • Author Soma Sekhar Published - 08:05 PM, Mon - 28 August 23
‘జైలర్’ మూవీకి షాకిచ్చిన ఢిల్లీ హైకోర్ట్!

‘జైలర్’.. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ. బ్లాక్ బస్టర్ హిట్ తో దుమ్మురేపింది. వసూళ్ల రికార్డు సాధిస్తూ.. ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. విడుదలై 18 రోజులు అవుతున్నప్పటికీ వసూళ్లు మాత్రం తగ్గలేదు. ఇప్పటికే రూ. 600 కోట్లను కొల్లగొట్టినట్లు సమాచారం. ప్రస్తుతం కూడా జైలర్ వసూళ్లు ఎక్కడా తగ్గలేదు. ఈ రేంజ్ లో దూసుకుపోతున్న రజినీకి ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈ చిత్రంలోని ఓ సీన్ లో ఐపీఎల్ జట్టు అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ జెర్సీని ఓ విలన్ గ్యాంగ్ లోని వ్యక్తి ధరిస్తాడు. ఈ సీన్ పైనే ఢిల్లీ హైకోర్ట్ తీర్పు ఇచ్చింది.

దుమ్మురేపే కలెక్షన్స్ తో దూసుకెళ్తున్న జైలర్ మూవీకి ఢిల్లీ హైకోర్ట్ షాక్ ఇచ్చింది. ఇప్పటికే రూ. 600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రజినీ స్టామినాను బాక్సాఫీస్ కు మరోసారి పరిచయం చేసింది జైలర్ మూవీ. తాజాగా ఈ మూవీలో ఆర్సీబీ జట్టు జెర్సీని ఓ విలన్ గ్యాంగ్ లోని వ్యక్తి ధరిస్తాడు. అదే టైమ్ లో సూపర్ స్టార్ ఆ వ్యక్తిని చంపేస్తాడు. ఇప్పుడు ఈ సీనే వివాదానికి దారితీసింది. దీంతో ఢిల్లీ హైకోర్ట్ ఆ సీన్ లో ఆర్సీబీ జెర్సీని తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.

సెప్టెంబర్ 1 నుంచి జైలర్ ప్రదర్శితం అయ్యే అన్ని థియేటర్లలోనూ ఇది అమలయ్యేలా చూడాలని తీర్పు ఇచ్చింది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే? ఆర్సీబీ జెర్సీ వేసుకున్న వ్యక్తిని చంపడంపై ఆర్సీబీ మేనేజ్ మెంట్ గానీ, ఐపీఎల్ యాజమాన్యం గానీ, వేరే ఇతర వ్యక్తులు గానీ ఈ విషయంపై ఫిర్యాదు చేసినట్లు లేదు. కానీ ఢిల్లీ హైకోర్ట్ ఇలాంటి ఆదేశాలను జారీ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


ఇదికూడా చదవండి: నన్ను మోసం చేశాడు.. ఆ నేతను అరెస్ట్ చేయండి: ‘హనుమాన్ జంక్షన్’ నటి డిమాండ్

Show comments