బాలీవుడ్ లోకి భోళా శంకర్! డేట్ కూడా ఇచ్చేశారు!

భోళా శంకర్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న పేరు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అతి తక్కువ ఓపెనింగ్స్ తీసుకొచ్చిన మూవీ ఇది. ఈ చిత్ర ఫలితం తేలిపోవడంతో డైరెక్టర్ మెహర్ రమేష్ పై ఒక రేంజ్ లో ట్రోల్స్ నడుస్తున్నాయి. ఎప్పుడో దశాబ్దం క్రితం డైరెక్షన్ పక్కన పెట్టేసిన మెహర్ కు మొహమాటం కొద్దీ బాస్ ఈ ఛాన్స్ ఇచ్చాడన్న టాక్ ఉంది. మెహర్ మాత్రం ఈ సూపర్ ఛాన్స్ ని ఉపయోగించుకోవడంలో అంతగా సక్సెస్ కాలేదు. ఇప్పటికే తెలుగు కలెక్షన్స్ వేగంగా డ్రాప్ అవుతూ వస్తున్నాయి. ఇక మూవీ యూనిట్ కూడా ప్రమోషన్స్ పై అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఏ విధంగా చూసుకున్నా భోళా నష్టాలు భారీగానే కనిపిస్తున్నాయి. కమర్షియల్ స్టార్ డంలో ఎవరెస్ట్ అంత ఎదిగిన మెగాస్టార్ కు భోళా శంకర్ వల్ల వచ్చే నష్టం ఏమి లేకపోయినా.. ఇప్పుడు మేకర్స్ తీసుకున్న ఓ నిర్ణయం మెగా ఫ్యాన్స్ ను కలవరపెడుతోంది.

భోళా శంకర్ మూవీని బాలీవుడ్ లో విడుదల చేయడానికి అంతా సిద్ధం అయ్యింది. ఇప్పటికే దీనికి సంబంధించిన టీజర్ కూడా విడుదల చేశారు. పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీన్స్ తో ఈ టీజర్ ని నింపేయడంతో బాలీవుడ్ భోళాకి కొత్త టచ్ యాడ్ అయినట్టు అయ్యింది. కానీ.., టాలీవుడ్ లో తేడా కొట్టిన మూవీని.. ఈ ఆగస్ట్ 25న హిందీ ప్రేక్షకుల ముందుకి తీసుకుపోవడం మెగా ఫ్యాన్స్ కు నచ్చడం లేదు. నిజానికి ఇప్పుడు పాన్ ఇండియా హవా నడుస్తున్నా.. చిరంజీవి మాత్రం దశాబ్దాల క్రితమే బాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కారణంగా ఆ లెగసీ ఇంకాస్త విస్తరించింది. ఇలాంటి సమయంలో భోళా బాలీవుడ్ మార్కెట్ లోకి వెళ్తే.. మెగా బ్రాండ్ కి డ్యామేజ్ తప్పదన్నది అభిమానుల వాదన. కానీ.., ఫ్యాన్స్ ఎమోషన్స్ కు, సినిమా కమర్షియల్ క్యాలిక్యులేషన్స్ కు మధ్య చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు భోళా మేకర్స్ పరిస్థితి కూడా ఇలానే ఉంది.

భోళా శంకర్ విడుదలకు ముందే హిందీ రిలీజ్ బిజినెస్ జరిగిపోయింది. “ఆర్కేడీ స్టూడియోస్” ఈ చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేస్తోంది. ఇందుకోసం వీరు ఓ ఫ్యాన్సీ అమౌంట్ ఇచ్చినట్టు సమాచారం. ఇప్పుడు టాక్ తేడా కొట్టిందని ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోలేరు. పైగా.. ఇలాంటి సమయంలో నిర్మాతలు ఎంత సేఫ్ అయితే అంత మంచిది. ఈ విషయాలు అన్నీ తెలుసు కాబట్టే.. మెగా బాస్ కూడా భోళా హిందీ రిలీజ్ కు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని టాక్. బీ-టౌన్ లో భోళా శంకర్ ఫలితం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని పక్కన పెడితే.. ఈ విషయంలో చిరు తీసుకున్న నిర్ణయం మాత్రం అభినందనీయం. మరి.. ఇకనైనా మెగాస్టార్ రీమేక్స్ పక్కన పెట్టి.. మళ్ళీ వింటేజ్ మెగాస్టార్ ని గుర్తు చేసేలా బౌన్స్ బ్యాక్ అవ్వాలని కోరుకుందాం.

Show comments