ఎమోషనల్ వీడియోకి కారణం చెప్పిన అనసూయ.. మరో వీడియో పోస్ట్

  • Author Soma Sekhar Published - 07:31 PM, Sat - 19 August 23
  • Author Soma Sekhar Published - 07:31 PM, Sat - 19 August 23
ఎమోషనల్ వీడియోకి కారణం చెప్పిన అనసూయ.. మరో వీడియో పోస్ట్

యాంకర్ అనసూయ.. ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన సెలబ్రిటీ. అందుకు కారణం ఆమె వెక్కి వెక్కి ఏడ్చిన వీడియోని పోస్ట్ చేయడమే. ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో అనసూయ అభిమానులు ఏం జరిగిందో అని ఆందోళన పడిపోతున్నారు. అసలు అనూ ఈ వీడియోను ఎందుకు పెట్టిందో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే తన కన్నీటికి కారణం చెబుతూ.. మరో వీడియోను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. అనసూయ బోరున ఏడ్చిన వీడియో చూసి.. తనపై సోషల్ మీడియాలో వచ్చే నెగటివిటిని తట్టుకోలేకే ఇలా ఏడ్చిందని చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఆమె కన్నీటికి కారణం అది కాదట. మరి అనసూయ కన్నీటికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.

యంకర్ అనసూయ బోరున ఏడ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీంతో ఆమెకు ఏ ఆపద వచ్చిందో అని ఆందోళన పడిపోతున్నారు ఫ్యాన్స్. దీంతో తన కన్నీటికి కారణం చెబుతూ మరో వీడియోను పోస్ట్ చేసింది అనసూయ. ఈ వీడియోలో అనసూయ మాట్లాడుతూ..”నేను పెట్టిన వీడియోను చాలా మంది కరెక్ట్ గానే అర్దం చేసుకున్నారు. కానీ కొంత మందికి అర్దం కాలేదు అనుకుంటా. నేను సోషల్ మీడియాలో నాపై వచ్చే నెగెటీవిటికి ఏడ్చాను అనుకుంటున్నారు. అది నిజం కాదు. మీకు తెలుసు నా ఫీలింగ్ ఏడుపుతో ఉండదు.. కోపంతో ఉంటుంది. ఇక నా కన్నీటికి కారణం.. నా జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆ నిర్ణయం కారణంగా నేను ఎంతో బాధపడ్డాను. అందుకోసం నేను ఏడ్చాను” అంటూ ఈ వీడియోలో చెప్పుకొచ్చింది అనసూయ.

ఇక నేను కరెక్ట్ గా ప్రజెంట్ చేయడంలో విఫలం అయితే చాలా కొద్ది మందికే అది అర్ధమై ఉంటుందని పేర్కొంది. సోషల్ మీడియాలో ప్రచారం చేసే వాటినే చెయ్యాలని నేను చెప్పాను అంతే కానీ నాపై విమర్శలు వచ్చాయని నేను కన్నీరు పెట్టుకోలేదు ఈ వీడియో ద్వారా స్పష్టం చేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ వీడియో కూడా వైరల్ గా మారింది. దాంతో మరోసారి విమర్శలకు దారి తీసింది అనసూయ. యూట్యూబ్ ఛానల్స్ కు మంచి కంటెంట్ ఇచ్చారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తుండగా.. ఏంటి ఇది అనసూయ అంటూ ఇంకోందరు విమర్శిస్తున్నారు. మరి అనసూయ షేర్ చేసిన రెండు వీడియోస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


ఇదికూడా చదవండి: లైఫ్ లో ఫస్ట్ టైం ఇలా జరిగింది.. జగపతిబాబు ఇంట్రెస్టింగ్ పోస్ట్!

Show comments