Krishna Kowshik
సోషల్ మీడియా యువతపై బాగా ప్రభావితం చూపుతుంది. సెలబ్రిటీలుగా మారేందుకు రీల్స్, షాట్స్ అంటూ పరుగులు పెడుతున్నారు. ప్రాణాలను సైతం లెక్కచేయడం లేదు.. తాజాగా..
సోషల్ మీడియా యువతపై బాగా ప్రభావితం చూపుతుంది. సెలబ్రిటీలుగా మారేందుకు రీల్స్, షాట్స్ అంటూ పరుగులు పెడుతున్నారు. ప్రాణాలను సైతం లెక్కచేయడం లేదు.. తాజాగా..
Krishna Kowshik
వెర్రి వెయ్యి విధాలు.. నేటి యువతను చూస్తుంటే ఈ సామెత నిజమే అనిపించకమానదు. ఓవర్ నైట్ స్టార్ అయిపోయేందుకు పిచ్చి పనులు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. రీల్స్, షాట్స్ అంటూ సామాజిక మాధ్యమాల్లో మునిగి తేలుతున్నారు. తమ సర్కిల్లో పేరు మారు మోగిపోవాలని, సెలబ్రిటీలు కావాలన్న కాంక్షతో ప్రాణాలను సైతం లెక్కచేయడం లేదు. కామన్ రీల్స్ చేస్తే ఎవరూ చూడరని, వెరైటీగా వీడియోలు చేయాలన్న కుతూహలంతో చెత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పిచ్చి ఎంత పీక్స్ లెవల్లోకి వెళ్లిందంటే.. వ్యూస్ కోసం రైళ్ల పట్టాలపై, మెట్రో రైళ్లలో, ఎత్తైన ప్రదేశాల్లో వీడియోలు చేస్తున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుగా రాణించాలన్న ఆశతో రిస్క్ చేసి ప్రమాదాలను కోరి తెచ్చుకుంటున్నారు. వీరి జీవితాన్నే కాదు.. పక్కన వారి లైఫ్ కూడా రిస్క్‌లో పెడుతున్నారు. ఇలాంటి ఘటనల్లో పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు.
ఈ రీల్స్ మోజులోనే ఇటీవల ముంబయికి చెందిన అన్వి కామ్ దార్ లోయలో పడి మృతి చెందింది. అలాగే ఓ జంట.. ఎత్తైన ప్రాంతాల్లో వేలాడుతూ నెటిజన్ల ఆగ్రహానికే కాదు.. పోలీసులతో ఛీవాట్లు తీసుకునేంత వరకు వెళ్లింది. ఇప్పుడు మరో యువతి రీల్ చేసేందుకు ఎత్తైన కొండ ప్రాంతానికి వెళ్లి.. కాలు జారి లోయలో పడింది. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని చంబాలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఎత్తైన కొండపై నిల్చుని రీల్ చేస్తుంది మహిళ.. కాస్తంత దూరంలో ఈ వీడియోను రికార్డు చేస్తుంది మరో యువతి. రీల్స్ చేసే క్రమంలో కొండపై ఉన్న మహిళ పాట పాడుకుంటూ.. డ్యాన్స్ చేస్తూ కొండపై నుండి పరిగెత్తుకుంటూ వస్తోంది. అంతలో ఒక్కసారిగా కాలు స్లిప్ అయ్యి.. కొండ మీద నుండి దొర్లుకుంటూ కిందకు వెళ్లిపోయింది. అయితే ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తుంది. తృటిలో ప్రాణాలతో బయటపడినట్లు సమాచారం.
ఇక ఈ వీడియోను చూసిన సోషల్ సైనికులు తమదైన స్టైల్లో మాటలతో విరుచుకు పడుతున్నారు. ఈ సన్నివేశాన్నిచాలా మంది హమ్ ఆప్కే హై కౌన్ సినిమాలో సీన్‌తో పోల్చుతున్నారు. ఆ సినిమాలో రేణుకా షహానే మెట్లపై పడి పోతుంది.. ఇప్పుడు ఈ రీల్‌ను రేణుకా షహానే రీల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంత మంది లైక్స్, ఫాలోవర్ల కోసం ఇలాంటి పిచ్చి పనులు చేయడం ఏంటనీ ప్రశ్నిస్తున్నారు. పాపులర్ అయ్యేందుకు ప్రాణాలను లెక్క చేయకపోవడంపై మండిపడుతున్నారు. మీకు ఫ్యామిలీ ఉంది ఆలోచించండి అంటూ మరికొంత మంది హితవు పలుకుతున్నారు. మొత్తానికి రీల్ చేసి ఫేమ్ అవ్వాలనుకున్న ఆమె.. ఇలా లోయలో పడి.. ఆ వీడియోతో వైరల్ అవుతుంది. రీల్స్, షాట్స్ మోజులో తప్పుదారి పడుతున్న యువత పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
पहाड़ी पर खड़ी होकर रील बना रही महिला खाई में फिसली।
वीडियो हिमाचल के चंबा का है।
कृपया जीवन को ऐसे रील बनाने वाले ख़तरों में न धकेले। #HimachalPradesh #Chamba
Video courtesy: NDTV pic.twitter.com/iKd1W0iWZ9— Ajit Singh Rathi (@AjitSinghRathi) September 15, 2024