అనారోగ్యంతో బాధపడుతున్న భర్తకు.. అమ్మగా మారిన భార్య

ఈ రోజుల్లో భార్య, భర్తులు ఒకరినొకరు అర్ధం చేసుకోని కష్ట, సుఖల్లో తోడుండాల్సిందిపోయి.. లేని పోని ఈగోలు, గొడవలతో విడిపోతున్నారు. కానీ, తాజాగా ఓ జంటను చూస్తే మాత్రం హృదయం భావోద్వేగంతో ఉప్పేంగిపోయేలా అనిపిస్తుంది. ఎందుకంటే.. అన్ని తానై బాధ్యత మోయాల్సిన ఓ భర్త అనారోగ్య సమస్యల కారణంగా తన భార్యకు చంటి పిల్లడిలా మారిపోయాడు.ఇక కష్టసుఖల్లో తోడుండాల్సిన భార్య ఆ భర్తకు అమ్మగా మారింది.

ఈ రోజుల్లో భార్య, భర్తులు ఒకరినొకరు అర్ధం చేసుకోని కష్ట, సుఖల్లో తోడుండాల్సిందిపోయి.. లేని పోని ఈగోలు, గొడవలతో విడిపోతున్నారు. కానీ, తాజాగా ఓ జంటను చూస్తే మాత్రం హృదయం భావోద్వేగంతో ఉప్పేంగిపోయేలా అనిపిస్తుంది. ఎందుకంటే.. అన్ని తానై బాధ్యత మోయాల్సిన ఓ భర్త అనారోగ్య సమస్యల కారణంగా తన భార్యకు చంటి పిల్లడిలా మారిపోయాడు.ఇక కష్టసుఖల్లో తోడుండాల్సిన భార్య ఆ భర్తకు అమ్మగా మారింది.

ప్రస్తుత కాలంలో వైవాహిక బంధాలు ఎలా దెబ్బ తింటున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్యోన్యంగా ఉండాల్సిన దాంపత్య జీవితాలే.. లేనిపోని తగాదలతో, మనస్పర్థలతో రాను రాను క్షీణిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిఒక్క దాంపత్య జీవితంలో నువ్వేంత.. నేనంతా.. అనే ఈగోలు చూపించుకుంటూ కాపురాలను కూల్చేసుకుంటున్నారు. నిండు నూరేళ్లు కష్టసుఖల్లో ఒకరికొకరు.. తోడు, నీడలా ఉండాల్సిన దాంపత్య జీవితం చిన్న చిన్న కారణాలకే ఆ బంధానికి ముగింపు పలికేందుకు సిద్ధపడుతున్నారు. ఇలాంటి కాలంలో ఓ జంటను చూస్తే మాత్రం.. హృదయం భావోద్వేగంతో ఉప్పేంగిపోయేలా అనిపిస్తుంది. ఎందుకంటే..అన్ని తానై బాధ్యత మోయాల్సిన ఓ భర్త అనారోగ్య సమస్యల కారణంగా తన భార్యకు చంటి పిల్లడిలా మారిపోయాడు.ఇక కష్టసుఖల్లో తోడుండాల్సిన భార్య ఆ భర్తకు అమ్మగా మారింది. మరీ, ఆ వివరాల్లోంటే చూద్దాం.

తాజాగా ఆదిలాబాద్ (D) ఏసాపూర్ చెందిన విజయ్, లక్ష్మి దంపతులు ఉన్నారు. అయితే కొన్నేళ్ల క్రితం వీరిక వివాహం కాగా, ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.  ఇక ఇద్దరి పిల్లలతో వీరి కాపురం సవ్యంగా సాగుతున్న తరుణంలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. 2018లో విజయ్ 2 కిడ్నీలు చెడిపోయాయి. దీంతో విజయ్ తీవ్ర ఆనారోగ్యనికి గురై మంచన పడ్డాడు. ముఖ్యంగా కుటుంబ పెద్ద దిక్కుగా తన పిల్లలను, భార్యను పోషించాల్సింది పోయి కుటుంబనికే భారంగా మారాడు.  అయితే బాధ్యతగా ఉండాల్సిన భర్త మంచన్న పడితే..  నాకు ఎందుకులే అని తన సుఖలను చూసుకుంటున్న కాలంలో..  లక్ష్మీ మాత్రం తన భర్తకు అండగా.. అమ్మలా నిలిచింది. అదే విధంగా కుటుంబ బాధ్యతను తన నెత్తిన వేసుకుంది.  ఈ క్రమంలోనే.. గత ఆరేళ్లుగా కూలీ పనులు చేస్తూ.. తన పిల్లలు భర్త అలానా పాలానా చూసుకుంటుంది.

అంతేకాకుండా.. తన భర్తకు 36KMల దూరంలో ఉన్న ఆస్పత్రిలో చికిత్స అందిస్తూ.. ప్రాణాలు కాపాడుకుంటుంది. కానీ, ఒక్క తన కష్టంతో ఆ మహిళ ఓ వైపు పిల్లలను, మరోవైపు భర్త కు చికిత్స అందించడం చాలా కష్టంగా మారింది. దీంతో ఎవరైనా దాతలు ఆదుకోవాలని, తన  భర్తకు అయ్యే చికిత్స కోసం ఆర్థిక సాయ కన్నీరు పెట్టుకుంటూ వేడుకుంటుంది. ఇదిలా ఉంటే.. వైవాహిక బంధం అంటే.. పాలు, నీళ్లలా కలిసి సద్దుకోపోవాల్సింది పోయి బజారున పడిపోయే స్థితికి వచ్చేస్తున్న ఈ కాలంలో ఈ జంటను చూస్తుంటే.. ప్రతి ఒక్కరికి మనసు మనసును హత్తుకుపోయింది. ముఖ్యంగా అనోన్యంగా ఉన్న ఈ దాంపత్య జీవితంలో దేవుడు ఎందుకు ఇంత చిన్నచూపు చూశాడో అని ప్రతిఒక్కరి మనసు కలిచివేసింది.

Show comments