బెంగుళూరులో స్టార్ట్ అయిన డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్! మరి HYDలో ఎప్పుడంటే?

నగరంలో వాహనాదారులకు ట్రాఫిక్ సమస్యలు అనేవి రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా బెంగళూర్ నగరంలో ఈ ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు అమలు చేసిన డబుల్ డెక్కర్ బ్రిడ్జి ఇంతవరకు హైదరాబాద్ నగరంలో రాకపోవడం గమన్హారం. మరి ఇంతకి నగరంలో ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ఎప్పుడు వస్తుంది. ఎక్కడ వస్తుంది ఆ వివరాలేంటో చూద్దాం.

నగరంలో వాహనాదారులకు ట్రాఫిక్ సమస్యలు అనేవి రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా బెంగళూర్ నగరంలో ఈ ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు అమలు చేసిన డబుల్ డెక్కర్ బ్రిడ్జి ఇంతవరకు హైదరాబాద్ నగరంలో రాకపోవడం గమన్హారం. మరి ఇంతకి నగరంలో ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ఎప్పుడు వస్తుంది. ఎక్కడ వస్తుంది ఆ వివరాలేంటో చూద్దాం.

నగరంలో వాహనాదారులకు ట్రాఫిక్ సమస్యలు అనేవి ఎన్నాటికీ తీరనివి. ఎందుకంటే.. ఈ మహా నగరాల్లో అడుగడుగునా ట్రాఫిక్ సమస్యలు అనేవి వెంటాడుతునే ఉంటాయి. ముఖ్యంగా ఆఫీసులకు, స్కూల్లకు, కాలేజీలకు వివిధ పనులకు బయటకు వెళ్లలసిన కార్మికులు, విద్యార్థులు, ఉద్యోగుస్తులకు ఈ ట్రాఫిక్ సమస్యలతో విసుగు చెందుతుంటారు. పైగా నగరంలో వర్షం పడినప్పుడు అయితే ఈ ట్రాఫిక్ సమస్య అనేది మరీ భయనకరంగా ఉంటుంది. గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించి పోతుంది. దీంతో నగరంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించడానికి ఓ వైపు మెట్రో సదుపాయలు, ఫ్లైఓవర్ ఉన్నప్పటికీ.. వాహనాదారులకు ట్రాఫిక్ సమస్య నీడలా వెంటాడుతునే ఉంటుంది.

అసలే భాగ్యనగరం ఓ వైపు విశ్వనగరంగా రూపుదిద్దుకుంటుంది. కాగా, ఇప్పటికే పలు అంతర్జాతీయ కంపెనీలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెడుతూ విస్తరించుకుపోతున్నాయి. ఇలాంటి సమయంలో మౌలిక వసతులు పరంగా నగరాన్ని మరింత అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే.. . రద్దీగా ఉండే రోడ్లతో వాహనదారులు ఇబ్బందులు పడకుండా ట్రాఫిక్ ను నియంత్రించడానికి పలు ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, అండర్‌పాసులు నిర్మించింది. మరికొన్ని ప్రాంతాల్లోనూ కొత్తగా ఫ్లైఓవర్ల నిర్మాణానికి సిద్ధమైంది. ఇక నగరవాసులకు సుఖవంతమైన, వేగవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు నగర మూలల వరకు మెట్రో విస్తరించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. అయిన సరే నగరంలో ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు అంతకంతకి ఎక్కువతున్నాయి కానీ, తగ్గడం లేదు. ఇదిలా ఉంటే.. మరోవైపు మహానగరంగా పేరు పొందిన బెంగళూరులో మాత్రం వాహనదారులకు ఈ ట్రాఫిక్ కష్టాల నుంచి గట్టేకించడానికి ఇప్పటికే డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

కానీ, మహానగరంగా విస్తరిస్తున్న హైదరాబాద్ లో మాత్రం ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్  జాడ లేదు. అసలే నగరంలో పంజాగుట్టు, ఖైరతాబాద్, లక్డీకపుల్, మేహదీపట్నం, మసాబ్ ట్యాంక్, అసెంబ్లీ, హిమయత్ నగర్, నక్లెస్ రోడ్డు, మదినా మార్కెట్ వంటి ప్రాంతాల్లో ఉండే ట్రాఫిక్ అనేది ఓ రేంజ్ లో ఉంటుంది. అలాంటి ఈ ట్రాఫిక్ సమస్యను నివారించడానికి నగరవాసులకు ఈ డబుల్ డెక్కర్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే కాస్త ఈ సమస్య నుంచి ఊరట లభిస్తుంది. అయితే అన్ని విషయాల్లో అభివృద్ధి చెందిన నగరంగా పేరు ప్రసిద్ధి చెంది ముందచులో ఉన్న హైదరాబాద్ నగరం.. ఈ ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టడంలో కాస్త వెనుకబడిందనే చెప్పవచ్చు. అయితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెడుతూ.. త్వరలోనే ఈ డబుల్ డెక్కర్ బ్రిడ్జిని నిర్మాణం చేసే ఆలోచనలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే.. ఇటీవలే నగరంలో ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ మొదటిగా మదీనాగూడలో నిర్మించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అయితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) నేతృత్వంలోని ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్, పట్టణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ముందడుగు వేస్తోంది. కాగా, మదీనాగూడలో నిర్మించేందుకు సన్నాద్ధమవుతున్నా ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ 2.5 కిలోమీటర్లు వరకు విస్తరించి ఉంటుంది. ఇకపోతే ఈ ఫ్లైఓవర్ ఎగువ డెక్‌లో ప్రైవేట్ వాహనాలకు, దిగువ డెక్‌లో బస్సులతో సహా ప్రజా రవాణాకు ప్రత్యేక మార్గాన్ని అందిస్తుంది. ఇక వినూత్నమైన డిజైన్ తో నిర్మించబోతున్న ఈ ఫ్లైఓవర్ రద్దీగా ఉండే ట్రాఫిక్ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుందని అంచనా వేస్తున్నారు.

అయితే ఇంతవరకు ఈ బ్రిడ్జ్ గురించి ప్రస్తావన కానీ, దానిని అమలు చేసే ప్రక్రియలో అధికారులు ముందడుగు వేసే దిశగా కానీ కనిపించడం లేదు.దీంతో నగరవాసులు పొరుగు రాష్ట్రం వచ్చిన  ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ హైదరాబాద్ నగరంలో ఇంకేప్పుడు వచ్చేది? ఒకవేళ వస్తే త్వరలోనే తమకు ఈ ట్రాఫిక్  తగ్గుముఖం పడతాయని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు కానీ, నగరంలో ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణంకు  ఇప్పటిలో శ్రీకారం చూట్టే జాడలు కనిపించడం లేదు. మరి, నగరంలో ఇప్పటి వరకు ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం అమలు కాకపోవడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments