Seized Money: ఎన్నికల సమయంలో పట్టుబడిన సొమ్మును ఏం చేస్తారంటే!

ఎన్నికల సమయంలో పట్టుబడిన సొమ్మును ఏం చేస్తారంటే!

ఎన్నికలు అంటే చాలు.. నాయకుల ప్రచారాలు, హామీలు, డబ్బుల మోతాలు కనిపిస్తుంటాయి. మరోవైపు పోలీసుల తనిఖీల్లో నోట్ల కట్టలు బయట పడుతుంటాయి. అయితే ఈ నగదు ఎక్కడి వెళ్తుందనేది చాలా మందిలో వచ్చే సందేహం. మరి.. ఆ వివరాలుఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఎన్నికలు అంటే చాలు.. నాయకుల ప్రచారాలు, హామీలు, డబ్బుల మోతాలు కనిపిస్తుంటాయి. మరోవైపు పోలీసుల తనిఖీల్లో నోట్ల కట్టలు బయట పడుతుంటాయి. అయితే ఈ నగదు ఎక్కడి వెళ్తుందనేది చాలా మందిలో వచ్చే సందేహం. మరి.. ఆ వివరాలుఏమిటో ఇప్పుడు చూద్దాం..

ప్రస్తుతం తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు వాతావరణం కొనసాగుతోంది. ఇప్పటికే మిజోరం,ఛత్తీస్ గడ్, రాజస్థాన్ రాష్ట్రాలకు ఎన్నికల ముగిసాయి. నవంబర్ 30న తెలంగాణలో పోలింగ్ జరగనుంది. మంగళవారంతో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని ముంగిపు పలకనుంది.  ఇది ఇలా ఉంటే.. ఎన్నికల వేళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా నగదు పట్టుబడింది. కేవలం తెలంగాణలోనే కాకుండా ఎన్నికలు జరుగుతున్న మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇదే విధంగా భారీగా నగదు, బంగారం పట్టుబడుతున్నాయి. అయితే ఈ నగదు అంతా ఎక్కడి  వెళ్తుందనేది చాలా మందిలో వచ్చే సందేహం. మరి.. ఇలా ఎన్నికల్లో పట్టుబడిన నగదు, ఎక్కడి వెళ్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక కేవలం డబ్బులనే కాదు,బంగారం, వెండి, వజ్రాభరణాలు, విలువైన వస్తువులు ఇలా ఏవైనా సరే అనుమానం వస్తే స్వాధీనం చేసుకుంటారు. అలానే పట్టుబడిన సొమ్ము రూ. 10 లక్షల లోపు ఉంటే పోలీసులు సంబంధిత వ్యక్తులను విచారిస్తారు. ఒకవేళ రూ.10 లక్షల కంటే ఎక్కువ ఉంటే ఆదాయపు పన్ను శాఖ రంగంలోకి దిగుతుంది. సరైన పత్రాలు, లెక్కల చూపిస్తే ఆ డబ్బును విడిపించుకుని తీసుకెళ్లొచ్చు. లేకుంటే మాత్రం ఆ నగదును అధికారులు స్వాధీనం చేసుకుంటారు. అనంతరం కోర్టుకు అప్పగిస్తారు. అక్కడి నుంచి ఆ నగదు ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్తుంది.

ఎన్నికల షెడ్యూల్‌ విడుదల అయిన దగ్గర నుంచి నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. పోలీసుల తనిఖీల్లో లెక్కా పత్రం లేకుండా తీసుకెళ్తున్న కోట్లాది రూపాయల నగదును పోలీసులు పట్టుకుంటున్నారు. అంతేకాక కేజీల కొద్ది బంగారం, వెండి కూడా పోలీసుల చేతికి చిక్కుతున్నాయి. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల సరిహద్దుల్లో కూడా స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. రాజస్థాన్‌లో ఎన్నికలకు ముందు ఇప్పటివరకు రూ.244 కోట్ల నగదు పట్టుబడింది.

ప్రస్తుతం తెలంగాణలో కూడా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 50 వేల రూపాయలకు మించి ఎక్కువ డబ్బుతో మీరు ప్రయాణిస్తుంటే రసీదులు తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇలా రసీదులు లేకుండా పోలీసుల తనిఖీల్లో కోట్లాది రూపాయాలు పోలీసులకు పట్టుపడుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ కోట్లాది రూపాయలు ఎక్కడికి పోతాయన్న సందేహం చాలా మంది వ్యక్తమవుతుంది.ఎన్నికల సమయంలో పోలీసులు ఏ నగదును స్వాధీనం చేసుకున్నా.. దాన్ని ఆదాయపు పన్ను శాఖకు అప్పగిస్తారు. అయితే, దీని తరువాత నగదు రికవరీ అయిన వ్యక్తి దానిని క్లైయిమ్ చేసుకోవచ్చు.

ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చిందనే ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలు చెప్పి.. తగిన పత్రాలను చూపించాలి. మీరు చెప్పిన వివరాల విషయాలను అధికారులు నమ్మకపోతే ఆ నగదును అధికారులు స్వాధీనం చేసుకుంటారు. సరైన పత్రాలు చూపించాకే మీ నగదు మీకు తిరిగి అప్పగిస్తారు. అంతవరకు కోర్టు కస్టడీలో మీ సొమ్ము జమ చేస్తారు. అయితే ఎవరూ డబ్బును క్లెయిమ్ చేయకపోతే అది ప్రభుత్వ ఖజానాలోకి వెళ్తుంది. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుంది.

Show comments