Nehru Zoological Park: నెహ్రూ జూ పార్క్‌కు సందర్శకుల తాకిడి.. ఒక్క రోజులోనే 30 వేల మంది

అలా పిల్లలతో బయటకు వెళ్లాలంటే.. బెస్ట్ ఆప్షన్ జూ పార్క్స్. అందులో ఉండే జంతువుల, పక్షులను చూసి పిల్లలు, పెద్దలు ఎంజాయి చేస్తుంటారు. వినోదంతో పాటు విజ్ఞానం కూడా కలుగుతుందన్న ఉద్దేశంతో వీటిని సందర్శిస్తుంటారు. తాజాగా నెహ్రూ జూ పార్క్‌కు సందర్శకుల తాకిడి ఒక్కసారిగా పెరిగింది..

అలా పిల్లలతో బయటకు వెళ్లాలంటే.. బెస్ట్ ఆప్షన్ జూ పార్క్స్. అందులో ఉండే జంతువుల, పక్షులను చూసి పిల్లలు, పెద్దలు ఎంజాయి చేస్తుంటారు. వినోదంతో పాటు విజ్ఞానం కూడా కలుగుతుందన్న ఉద్దేశంతో వీటిని సందర్శిస్తుంటారు. తాజాగా నెహ్రూ జూ పార్క్‌కు సందర్శకుల తాకిడి ఒక్కసారిగా పెరిగింది..

వీకెండ్ వచ్చినా.. ఎక్కువ సెలవులు కలిసొచ్చినా.. ముందుగా ఎక్కడికి వెళ్లాలని ప్లాన్ చేస్తుంటారు. దూరాభారాలు చేయలేని వాళ్లు.. సమీపంలో ఉన్న పర్యాటక ప్రాంతాలకు వీక్షించాలని భావిస్తుంటారు. పిల్లలతో కలిసి.. అలా సరదాగా టైంపాస్ చేద్దామనుకునేవాళ్లూ.. మ్యూజియం, పార్క్, జులాజికల్ పార్క్ వంటి వాటికి వెళుతుంటారు. పొద్దున్నే వెళ్లి సాయంత్రం వచ్చేసే విధంగా అందుకు తగ్గ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాల్లో ఇలాంటి ప్రదేశాలకు కొదవలేదు. చాలా మంది సెలవులు వస్తే చాలు.. చార్మినార్, ట్యాంక్ బండ్, మాల్స్, పార్క్‌లు వెళ్లి చిల్ అవుతుంటారు. అలాంటి పర్యాటక ప్రాంతాల్లో ఒకటి నెహ్రు జులాజికల్ పార్క్.

హైదరాబాద్ నగర వాసులకు వీకెండ్ వస్తే.. యూత్ అంతా పబ్స్‌లో వాలిపోయినట్లు.. ఫ్యామిలీ మెన్ అంతా భార్యా పిల్లలతో కాలక్షేపానికి మాల్స్, పార్కులు వెళుతుంటారు. ఇక ఆదివారం అందరికీ సెలవు ఉంటుంది కాబట్టి.. ఎక్కువగా ఫ్యామిలీలతో కలిసి.. జూపార్క్ సందర్శిస్తుంటారు. అలాగే తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు, ఏపీ, విదేశీ పర్యాటకులు కూడా వస్తుంటారు. అయితే ఈ ఆదివారం మాత్రం నిరుడు లెక్క కాదూ.. రికార్డు స్థాయిలో జనాలు వచ్చారు. శనివారం వీకెండ్‌తో పాటు ఆదివారం, సోమవారం క్రిస్ మస్, మంగళవారం కూడా కొన్ని స్కూల్స్, కాలేజీలు సెలువులు ప్రకటించడంతో లాంగ్ లీవ్స్ వచ్చాయి. దీంతో జూ పార్క్‌కు తాకిడి పెరిగింది. ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు.

ఈ ఆదివారం.. అనగా.. డిసెంబర్ 24వ తేదీన రికార్డు స్థాయిలో పర్యాటకులు నెహ్రు జంతు ప్రదర్శనశాలకు వచ్చి సందడి చేశారు. ఒక్క ఆదివారమే సుమారు 30 వేల మంది పర్యాటకులు వచ్చారు. దీంతో భారీగా ఆదాయం వచ్చింది. హైదరాబాద్ మీర్ ఆలమ్ సమీపంలో ఉన్న ఈ జూ పార్క్‌ను తెలంగాణ అటవీ శాఖ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఇది 380 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇందులో సుమారు 1500 జంతువులు, పక్షులు, జలచరాలు ఉన్నాయి. ఇందులో టాయ్ రైలు ప్రధాన ఆకర్షణ. అలాగే ఇందులో తెల్ల నెమళ్లు, ఆఫ్రికన్ ఏనుగులు, చింపాంజీలు, ఖడ్గమృగాలు, సింహాలు, పులులు ఉంటాయి. అలాగే జూ లోపల సందర్శకులు ఎంజాయ్ చేసేది లయన్ సఫారి. అరణ్యంలో స్వేచ్ఛగా తిరుగుతున్న సింహాలు, పులులు, ఖడ్గ మృగాలు, ఫాంథర్స్ వంటి వాటిని ఓ సెక్యూర్డ్ వ్యాన్ ద్వారా వీక్షించవచ్చు.

Show comments