Telangana Assembly Elections 2023: అలాంటి నేతలకు షాకిచ్చిన యువ ఓటర్లు!

అలాంటి నేతలకు షాకిచ్చిన యువ ఓటర్లు!

తెలంగాణలో ఎన్నికల వాతావరణం హీటెక్కింది. గెలుపే లక్ష్యంగా అధికార, విపక్ష పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాక అభ్యర్ధులు కూడా ఎన్నికల ఖర్చుల కోసం భారీగా డబ్బు సిద్దం చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బాధ్యత కలిగిన కొందరు యువ ఓటర్లు వినూత్న రీతిలో ఓటు విలువ తెలియజేస్తున్నారు.

తెలంగాణలో ఎన్నికల వాతావరణం హీటెక్కింది. గెలుపే లక్ష్యంగా అధికార, విపక్ష పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాక అభ్యర్ధులు కూడా ఎన్నికల ఖర్చుల కోసం భారీగా డబ్బు సిద్దం చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బాధ్యత కలిగిన కొందరు యువ ఓటర్లు వినూత్న రీతిలో ఓటు విలువ తెలియజేస్తున్నారు.

తెలంగాణలో ఎన్నికల వాతావరణం హీటెక్కింది. గెలుపే లక్ష్యంగా అధికార, విపక్ష పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాక అభ్యర్ధులు కూడా ఎన్నికల ఖర్చుల కోసం భారీగా డబ్బు సిద్దం చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బాధ్యత కలిగిన కొందరు యువ ఓటర్లు వినూత్న రీతిలో ఓటు విలువ తెలియజేస్తున్నారు. అంతేకాక డబ్బుతో ఓట్లు కొనుగోలు చేయోచ్చులే అనుకునే నేతలకు ఆ ఓటర్లు షాకిస్తున్నారు. మేం మా ఓటు అమ్ముకోమంటూ ఇంటి ముందు బోర్డులు పెట్టి.. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఓ కుటుంబ సభ్యులు.. ఓట్లు అమ్మబడవు అంటూ వారి ఇంటికి బోర్డు తగిలించారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ మండలం ఓ గ్రామానికి చెందిన వాణి అనే మహిళ ఓట్లు అమ్మబడవు అంటూ ఇంటి గేటుకు బోర్డు పెట్టింది. ఆ మహిళ పెట్టిన బోర్డు చూసి అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక ఆమె చేసిన పని సూపర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓట్లు అమ్మబడవు అంటూ ఆమె తగిలించిన బోర్డును చూసి.. నోటుతో ఓటు కొనాలనుకునే నేతలు ఆ ఇంటి వైపు వెళ్లాలంటే అబ్బో అంటున్నారు. తమ ఇంట్లో ఉన్న ఓట్లను ఏ రాజకీయ పార్టీకి డబ్బులకు గానీ, మద్యానికి అమ్ముకోమని ఈ యువతీ తెలుపుతున్నారు. రాజకీయ పార్టీల ప్రలోభాలకు లొంగిపోవడం వల్లే మన హక్కుల్ని కోల్పోతున్నామని అంటున్నారు.

నోట్లతో ఓట్లు కొనవచ్చని భావించే  రాజకీయ నేతలు తన ఇంటికి రావద్దని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాక ఈ కుటుంబం తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్‌గా మారింది. మరికొందరు బాధ్యత కలిగిన వారు కూడా అదే బాటల పయనిస్తున్నారు. యువతిని ఆదర్శంగా తీసుకుని తమ ఇంటి ముందుకు వచ్చే నేతలకు గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంతేకాక ఆ యువతి మాదిరిగానే  మా ఓటును అమ్ముకోమని బోర్డులు ఏర్పాటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments