యూనియన్ బ్యాంకులో మేనేజర్ భారీ మోసం! ఏకంగా రూ.5 కోట్ల కొట్టేశాడు!

Union Bank Manger Nizamabad: ప్రజలు ఎంతగానో నమ్మే బ్యాకింగ్ రంగంలో కూడా కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. గతంలో బ్యాంకులో పని చేస్తున్న ఓ మహిళ, ఆమె భర్తతో కలిసి 200కోట్ల మోసానికి పాల్పడింది. తాజాగా మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది.

Union Bank Manger Nizamabad: ప్రజలు ఎంతగానో నమ్మే బ్యాకింగ్ రంగంలో కూడా కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. గతంలో బ్యాంకులో పని చేస్తున్న ఓ మహిళ, ఆమె భర్తతో కలిసి 200కోట్ల మోసానికి పాల్పడింది. తాజాగా మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది.

నేటి సమాజంలో ఎవర్ని నమ్మాల్లో, ఎవర్ని నమ్మకూడదో అర్థం కానీ పరిస్థితులు ఏర్పడ్డాయి.  ఎవరు ఎప్పుడు ఎలా మోసం చేస్తారో తెలియకుండా ఉంది. ముఖ్యంగా కొందరు ఈజీగా డబ్బులను సంపాదించేందుకు అనేక మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారిలో కొందరు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఉంటున్నారు. ముఖ్యంగా ప్రజలు ఎంతగానో నమ్మే బ్యాకింగ్ రంగంలో కూడా కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. గతంలో బ్యాంకులో పని చేస్తున్న ఓ మహిళ, ఆమె భర్తతో కలిసి 200కోట్ల మోసానికి పాల్పడింది. తాజాగా మరో బ్యాంక్ మేనేజర్ కూడా ఖాతాదారులను మోసం చేస్తూ..రూ.5 కోట్లు స్వాహా చేశాడు. ఈఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

నిజామాబాద్ పట్టణంలో అజయ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతడు పట్టణంలోని శివాజీ నగర్ లో ఉండే యూనియన్ బ్యాంకులో మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో కొద్దిమంది ఖాతాదారులకు 8 నెలల క్రితం టర్మ్ లోన్ తో పాటు క్రెడిట్ ఆన్ కరెంటు(సీసీ) రుణాలను కూడా మంజూరు చేశాడు. ఈ క్రమంలోనే 40 మంది అకౌంట్లలో మొదట టర్మ్‌ లోన్‌ కు సంబంధించిన డబ్బులను ఖాతాల్లో జమ చేశాడు. అదే సమయంలో మరో సీసీ రుణం అప్లయ్ చేసేందుకు వినియోదారుల నుంచి అవసమైన బ్యాంకు చెక్కులను, ప్రాపర్టీ డాక్యూమెంట్స్ ను తీసుకున్నాడు. ఆ తరువాత రెండో సీసీ లోన్‌ మంజూరు కాలేదని  ఖాతాదారులను నమ్మించాడు. వారికి మంజురైన లోన్‌ డబ్బు రూ. 5 కోట్లను తన అకౌంట్లోకి బదిలీ చేసుకున్నాడు. ఈ లావాదేవీలు మొత్తం గతేడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో జరిగాయి. అయితే ఇటీవల బ్యాంకు ఉన్నాతాధికారులు తనిఖీలకు వచ్చారు.

ఈ క్రమంలోనే ఆ బ్యాంకులో రుణాల మంజూరులో, లావాదేవీల్లో అవకతవకలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత వినియోదారులను పిలిచి విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భారీ మొత్తంలో రుణాల స్వాహా వ్యవహారం బయటపడింది. ఈ రుణాల పేరిట దాదాపు 40 మంది ఖాతాల్లో నుంచి రూ.5 కోట్లకు పైగా డబ్బును తన ఖాతాలో జమ చేసుకున్నట్లు గుర్తించారు. దీంతో బాధితులు లబోదిబోమంటూ మంగళవారం రాత్రి పోలీసులను కలిశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు అజయ్‌పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు బ్యాంకు మేనేజర్ అజయ్‌ పరారీలో ఉన్నాడు. గతంలో కూడా  హైదరాబాద్ కు చెందిన ఓ దంపతులు… 200కోట్ల రూపాయాలు మోసం చేశారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ ఘటన మరువక ముందే..తాజాగా నిజామాబాద్ లో మరో ఘరాన మోసం బయటపడింది.

Show comments