ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది.. పాపం, నడి రోడ్డుపై..!

నీరజ చిన్నప్పటి నుంచి ఎంతో హుషారుగా ఉండేది. చదువుల్లో కూడా బాగా రాణించేది. ఇక ఉన్నత చదువులు పూర్తి చేయాలని గతంలో అమెరికా వెళ్లింది. కానీ, ఇటీవల ఏం జరిగిందంటే?

నీరజ చిన్నప్పటి నుంచి ఎంతో హుషారుగా ఉండేది. చదువుల్లో కూడా బాగా రాణించేది. ఇక ఉన్నత చదువులు పూర్తి చేయాలని గతంలో అమెరికా వెళ్లింది. కానీ, ఇటీవల ఏం జరిగిందంటే?

ఈ అమ్మాయి పేరు నీరజ. ఖమ్మంలోని ఓ మెడికల్ కాలేజీలో బీడీఎస్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఉన్నత చదువులు చదువుకోవాలని అనుకుంది. ఇందులో భాగంగానే తల్లిదండ్రుల సాయంతో కష్టపడి అమెరికా వెళ్లింది. అక్కడ ఓ ప్రముఖ యూనివర్సిటీలో పీజీ చేస్తుంది. రోజూ కాలేజీకి వెళ్తూ వస్తూ ఉండేది. ఈ క్రమంలోనే నీరజ రోడ్డుపై వెళ్తుండగా ఊహించని ఘటన చోటు చేసుకుకుంది. దీంతో ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఇంతకు అసలేం జరిగిందంటే?

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సీరోలు మండలం కాంపల్లి గ్రామానికి చెందిన నీరజ (28) చిన్నప్పటి నుంచి ఎంతో హుషారుగా ఉండేది. ఇంతే కాకుండా చదువుల్లో కూడా ఈ అమ్మాయి రాణిస్తూ ఉండేది. ఇక తెలంగాణలోని ఖమ్మం పట్టణంలోని ఓ ప్రముఖ మెడికల్ కాలేజీలో నీరజ బీడీఎస్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాలని అనుకుంది. ఇక ఇందు కోసం ఆ అమ్మాయి తన కుటంబ సభ్యులను అందరినీ ఒప్పించింది. అన్నుకున్నట్లే ఈ యువతికి అమెరికా మెస్సోరి రాష్ట్రంలోని లూయిస్ యూనిర్సిటీల్లో సీటు వచ్చింది. దీంతో ఆ యువతి ఎంతో మురిసిపోయింది. ఆ తర్వాత తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఎలాగో కష్టపడి అమెరికా వెళ్లింది.

ప్రస్తుతం నీరజ పీజీ మొదటి సంవత్సరం చదువుతోంది. అలా ఆ యువతి ప్రతి రోజూ కాలేజీకి వెళ్తూ తిరిగి తన రూమ్ కు చేరుకునేది. ఈ క్రమంలోనే అటు చదువుకుంటూనే పార్ట్ టైమ్ జాబ్ కూడా చేసేదని తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. గత నెల 28న నీరజ కూరగాయల కోసమని స్థానికంగా ఉండే ఓ మార్కెట్ కు వెళ్లింది. తనకు కావాల్సిన కూరగాయలు తీసుకుని తిరిగి ఇంటికి వెళ్లాలని బయలు దేరింది. అయితే ఈ క్రమంలోనే నీరజ రోడ్డు ప్రమాదానికి గురైంది. స్థానికులు గమనించి వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఆమె అప్పటికే చనిపోయిందని నిర్ధారించారు.

అనంతరం ఇదే విషయాన్ని ఈ యువతి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఈ సంగతి తెలుసుకుని మృతిరాలి కుటుంబ సభ్యులు, బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఇదిలా ఉంటే.. ఈ శనివారం నీరజ మృతదేహాన్ని తన స్వగ్రామానికి తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక మృతురాలి తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు. బాగా చదువుకుని మంచి ఉద్యోగంతో స్థిరపడదామని వెళ్లిన నీరజ.. శవమై తిరిగి రావడంతో వారి గ్రామస్తులు శోక సంద్రంలో మునిగపోయారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. చదువు కోసం అమెరికా వెళ్లి శవమై తిరిగొచ్చిన నీరజ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments