Uppula Naresh
వీరిద్దరు గతంలో ప్రేమించుకున్నారు. ఒకరంటే ఒకరికి చచ్చేంత ప్రేమ. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. పెద్దలు నిరాకరించడంతో ఎదురించి మరీ చేసుకున్నారు. కానీ, ఆ ఒక్క ఘటనే ఊహించని విషాదాన్ని మిగిల్చింది. అసేలేం జరిగిందంటే?
వీరిద్దరు గతంలో ప్రేమించుకున్నారు. ఒకరంటే ఒకరికి చచ్చేంత ప్రేమ. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. పెద్దలు నిరాకరించడంతో ఎదురించి మరీ చేసుకున్నారు. కానీ, ఆ ఒక్క ఘటనే ఊహించని విషాదాన్ని మిగిల్చింది. అసేలేం జరిగిందంటే?
Uppula Naresh
పైన కనిపిస్తున్న వీళ్లిద్దరూ భార్యాభర్తలు. గతంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహానికి పెద్దలు నిరాకరించడంతో ఎదురించి మరీ చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ దంపతులు సంతోషంగానే గానే ఉన్నారు. ఇక కొంత కాలానికి ఈ యువకుడు తన భార్యను ఇంటికి తీసుకొచ్చి కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా ఉంటున్నాడు. కానీ, ఊహించని ఘటనతో ఈ దంపతుల తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇంతకు ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా జైపూర్ మండలం శెట్టిపల్లి గ్రామంలో సాయి తరుణ్ (22) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతడికి ఇదే ఊరికి చెందిన జ్యోతిక అనే అమ్మాయితో పరిచయం ఉండేది. ఈ పరిచయం కాస్త ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. దీంతో అప్పటి నుంచి ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఇక పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. కానీ, వీరిద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలు నిరాకరించారు. అయినా సరే ఈ ప్రేమ జంట ఏడాది కిందట పెద్దలను ఎదురించి ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఇక కొంత కాలం తర్వాత సాయి తరుణ్ తన భార్యను తీసుకుని ఇంటికి వచ్చాడు. ఇక్కడే ఉంటూ వీళ్లిద్దరూ సంతోషంగా ఉండేవారు.
ఇదిలా ఉంటే.. జ్యోతిక గర్భిణీ కావడంతో రక్తహీనతతో బాధపడింది. దీంతో సాయి తరుణ్ ఆస్పత్రిలో చేర్పించాడు. కానీ, పరిస్థితి విషమించడంతో ఈ అమ్మాయి నెల కిందటే ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయింది. భార్య మరణించడంతో సాయి తరుణ్ గుండెలు పగిలేలా ఏడ్చాడు. ఈ విషయం తెలుసుకున్న జ్యోతిక తల్లిదండ్రులు సైతం కన్నీరు మున్నీరుగా విలపించారు. అలా కొన్ని రోజులు గడిచింది. సాయి తరుణ్ మాత్రం భార్య మరణాన్ని తట్టుకోలేక రోజూ బాధపడుతూ ఉండేవాడు. అయితే, జ్యోతిక లేనిది నేను ఉండలేను అనుకున్నాడో ఏమో కానీ.. వారం రోజుల కిందట ఈ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కానీ, ఫలితం లేకపోవడంతో సాయి తరుణ్ చికిత్స పొందుతూ శుక్రవారం ప్రాణాలు కోల్పోయాడు. కుమారుడి మరణవార్తతో అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనతో మృతుని స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రియురాలి మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న సాయి తరుణ్ చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.