Keerthi
సినీ ఇండస్ట్రీలో చాలామంది తారలు ప్రముఖుల చేతిలో శారీరకంగా మోసపోతుంటారు. అయితే తాజాగా మరో జూనియర్ ఆర్టిస్ట్ కూడా ఒకరి చేతిలో నమ్మి మోసపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతకి ఎవరంటే..
సినీ ఇండస్ట్రీలో చాలామంది తారలు ప్రముఖుల చేతిలో శారీరకంగా మోసపోతుంటారు. అయితే తాజాగా మరో జూనియర్ ఆర్టిస్ట్ కూడా ఒకరి చేతిలో నమ్మి మోసపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతకి ఎవరంటే..
Keerthi
సినీ ఇండస్ట్రీ అనేది ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ తరుచు ఎంతోమంది తారలు నటనపై ఆసక్తితో వెండితెర పై అడుగు పెడుతుంటారు. ఈ క్రమంలోనే వారు నటులుగా కొనసాగాడానికి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా చిన్న ఆర్టిస్ట్ ల నుంచి స్టార్ హీరోయిన్ ల వరకు ప్రతి ఒక్కరు ఆర్థికంగా, శారీరకంగా ఇండస్ట్రీలో ప్రముఖల చేత అనేక ఇబ్బందులకు గురై మోసపోయిన వాళ్లు ఉన్నారు. తాజాగా మరో జూనియర్ అర్టిస్ట్ ను పెళ్లి చేసుకుంటానని ఓ పోలీసు అధికారి నమ్మించి శారీరకంగా లోబరుచుకున్నాడు. ఆ వివరాళ్లోకి వెళ్తే..
పెళ్లి చేసుకుంటానని ఓ యువతిని నమ్మించి శారీరకంగా లోబరుచుకొని.. ఆ తర్వాత మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్న ఓ ఎస్ఐని సైదారబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోలీసుల తెలిపిన కథనం ప్రకారం.. నిజామాబాద్ కు చెందిన పబ్బా అరుణ్ (29) సిద్దిపేట కమిషనరేట్ లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా, ఈయన 2021లో సైదాబాద్ పోలీస్ స్టేషన్ లో ట్రైనీ ఎస్ఐగా పని చేశాడు. అప్పుడే అరుణ్ కి.. నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన ఓ యువతి(23)తో పరిచయం ఏర్పాడింది.
కాగా, సదరు యువతి సైదాబాద్ సరస్వతీనగర్ కాలనీలోని తన బంధువుల ఇంట్లో ఉంటూ జూనియర్ ఆర్టిస్ట్ గా పని చేస్తుండేది. అయితే, 2022 జనవరిలో ఆ యువతి తమ బంధువుల కుటుంబ సమస్యల విషయం పై సైదాబాద్ పీఎస్ కు వెళ్లింది. ఈ క్రమంలోనే.. ట్రైనీ ఎస్ఐ పబ్బా అరుణ్ ఆమెకు పరిచయమయ్యాడు. ఇక అప్పటి నుంచి వీరిద్దరూ తరచూ ఫోన్ లో మాట్లాడుకునేవారు. అలా అరుణ్.. ఆ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఆమెను శారీరకంగా లోబరుచుకున్నాడు. ఆ తర్వాత.. అరుణ్ ట్రైనింగ్ పూర్తయ్యి అతడు సిద్దిపేట పరిధిలోని గజ్వేల్, ప్రజ్ఞాపూర్ లలో పని చేస్తుండే వాడు. కానీ అప్పుడు కూడా ఆ యువతిని తన వద్దకు రప్పించుకునేవాడు.అయితే.. ఇటీవలే అరుణ్ కు వేరే యువతితో నిశ్చితార్థమైన ఫోటోలను ఫోన్ లో చూసిన బాధితురాలు అతడిని నిలదీసింది. దీంతో ఖంగు తిన్న అరుణ్ తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటానని, నిన్నే పెళ్లి చేసుకుంటానని ఆ యువతిని నమ్మబలికాడు.
కానీ, అక్కడికి కొన్ని రోజలకు నిశ్చితార్థమైన యువతి సోదరుడు.. బాధిత యువతికి గత నెల ఫోన్ చేసి అరుణ్ తన సోదరినే పెళ్లి చేసుకుంటన్నట్లు చెప్పాడు. దీంతో ఆమె వెంటనే అరుణ్ కు ఫోన్ చేసి ఈ విషయంపై ప్రశ్నించడంతో.. అవును నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటునని.. తనని మరచిపోమని చెప్పి ఫోన్ పెట్టేశాడు. దీంతో తాను మోసపోయినని గ్రహించిన యువతి శనివారం సైదారబాద్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. వెంటనే బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్ఐ పబ్బా అరుణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరి, జూనియర్ ఆర్టిస్ట్ అయిన ఆ యువతి ఎస్ఐ చేతిలో మోసపోవడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.