TGSRTC భారీ శుభవార్త.. ఇకపై వారందరికి ఉచితంగా

TGSRTC-Free Health Check Up, RTC Employees Partners: తెలంగాణ ఆర్టీసీ సంస్థ సంచలన ప్రకటన చేసింది. ఇకపై వారికి కూడా ఉచితంగా ఆ సేవలు అందిస్తామని తెలిపింది. ఆ వివరాలు..

TGSRTC-Free Health Check Up, RTC Employees Partners: తెలంగాణ ఆర్టీసీ సంస్థ సంచలన ప్రకటన చేసింది. ఇకపై వారికి కూడా ఉచితంగా ఆ సేవలు అందిస్తామని తెలిపింది. ఆ వివరాలు..

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ.. టీజీఎస్‌ఆర్టీసీ.. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు.. ఎప్పటికప్పుడు వినూత్న నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. ఇక ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ.. ఎన్నికల వేళ ఇచ్చిన ప్రకారం.. మహిళలకు ఆర్టీసీలో ఉచిత జర్నీ అవకాశం కల్పిస్తోన్న సంగతి తెలిసిందే. దీని వల్ల ఆర్టీసీలో రద్దీతో పాటు.. ఆదాయం కూడా భారీగా పెరిగింది. మహిళలకు ఉచిత ప్రయాణం అందించడం వల్ల రద్దీ పెరగడం వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. బస్సుల సంఖ్య పెంచుతామని.. సిబ్బందిని నియమిస్తామని ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రయాణికులతో పాటు.. సిబ్బంది సంక్షేమం కోసం కూడా ఆర్టీసీ అనేక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఆర్టీసీ ఓ ప్రకటన చేసింది. ఇకపై వారికి కూడా ఉచితంగా ఆ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించింది. ఆ వివరాలు..

టీజీఎస్‌ఆర్టీసీ తాజాగా మరో శుభవార్త చెప్పింది. సిబ్బంది కోసం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇంతకు ఆ నిర్ణయం ఏంటి అంటే.. గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్‌లో భాగంగా ఆర్టీసీ ఉద్యోగుల జీవిత భాగస్వాములకు కూడా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని యాజమాన్యం నిర్ణయించినట్టు టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఆగస్టులో వైద్య పరీక్షలను ప్రారంభించి వారి హెల్త్ ప్రొఫైల్స్‌ని రూపొందించేలా ఆర్టీసీ ప్రణాళికలు రచిస్తోంది. తాజాగా మంగళవారం నాడు.. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళా భవన్‌లో మంగళవారం రాష్ట్రస్థాయి హెల్త్ వాలంటీర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా సజ్జనార్‌ మాట్లాడుతూ.. దేశంలోని ఏ ప్రభుత్వ రంగ సంస్థ చేయని విధంగా.. తెలంగాణ ఆర్టీసీ సంస్థ.. తన సిబ్బంది ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తూ.. సంస్థలోని ప్రతి ఒక్క ఉద్యోగికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి.. వారి హెల్త్‌ ప్రొఫైల్స్‌ను సిద్ధం చేశాము అని తెలిపారు. మొదటి ఛాలెంజ్‌లో భాగంగా అద్దె బస్సు డ్రైవర్లతో సహా 47 వేల మంది సిబ్బందికి, రెండో ఛాలెంజ్‌లో భాగంగా 45 వేల మంది ఉద్యోగులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ ఛాలెంజ్‌లను విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించిన వైద్యులు, హెల్త్‌ వాలంటీర్లకు సజ్జనార్‌ కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ వైద్య పరీక్షల్లో తీవ్రమైన గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న 450 మంది ఉద్యోగులను గుర్తించి.. వారికి ముందుగా చికిత్స అందించి.. ప్రాణాలను కాపాడగలిగిందని సజ్జనార్ తెలిపారు. గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్‌లతో మంచి ఫలితాలు వస్తున్నాయని.. సిబ్బంది ఆరోగ్యం మెరుగుపడుతోందని సజ్జనార్‌ చెప్పుకొచ్చారు. దాంతో ఇకపై ప్రతి ఏడాది ఈ గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని నిర్వహించాలని సంస్థ భావిస్తోందని సజ్జనార్ తెలిపారు.

ఉద్యోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిని సూపర్‌ స్పెషాలిటీగా తీర్చిదిద్దామని చెప్పుకొచ్చారు. అలానే ప్రతి ఒక్క సిబ్బందిని తమ కుటుంబ సభ్యుడిలాగా భావించి సేవ చేయాలని సజ్జనార్‌ పిలుపునిచ్చారు. అంతేకాక గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్-2 అమలులో అత్యుత్తమ పనితీరును కనబరిచిన హెల్త్ వలంటీర్లను సంస్థ తరఫున ఎండీ సజ్జనార్‌ సత్కరించారు.

Show comments