TGSRTC రికార్డ్ బ్రేక్.. 20 లక్షలకు చేరిన రోజువారీ ప్రయాణీకుల సంఖ్య.. మహిళలు ఎంతమందటే.?.

TGSRTC రికార్డ్ బ్రేక్ చేసింది. రోజువారీ ప్రయాణీకుల సంఖ్య 20 లక్షలకు పెరిగింది. మహాలక్ష్మీ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మహిళలు ఎంత మంది ప్రయాణిస్తున్నారో తెలుసా..

TGSRTC రికార్డ్ బ్రేక్ చేసింది. రోజువారీ ప్రయాణీకుల సంఖ్య 20 లక్షలకు పెరిగింది. మహాలక్ష్మీ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మహిళలు ఎంత మంది ప్రయాణిస్తున్నారో తెలుసా..

తెలంగాణలో గత ఏడాది చివరిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మహాలక్ష్మీ పథకంలో భాగంగా ఆర్టీసీలో ఉచిత ప్రయాణంపై తొలి సంతకాన్ని చేశారు. ఆ రోజు నుండి రాష్ట్ర మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణీస్తున్న సంగతి విదితమే. కేవలం మహిళలకు మాత్రమే కాకుండా విద్యార్థినులు, యువతులు, ట్రాన్స్ జెండర్లకు కూడా ఉచిత ప్రయాణాన్ని అందిస్తోంది కాంగ్రెస్ సర్కార్. ఈ పథకానికి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఆర్టీసీలో మహిళలు ప్రయాణీస్తున్న సంఖ్య నానాటికి పెరుగుతుంది. రద్దీ నెలకొన్న నేపథ్యంలో బస్సుల సంఖ్య కూడా టీజీఎస్ ఆర్టీసీ పెంచింది. అలాగే సంస్థ కూడా లాభాల బాట పట్టింది.

ఇప్పుడు రికార్డులు బ్రేక్ చేస్తోంది తెలంగాణ ఆర్టీసీ. ఆర్టీసీ ద్వారా రాకపోకలు సాగిస్తున్న వారి సంఖ్య రోజుకు 20 లక్షలకు చేరింది. ఇందులో విశేషం ఏంటంటే.. అత్యధిక శాతం మంది మహిళలే కావడం గమనార్హం. 20 లక్షల మంది ప్రయాణీకులు ఉంటే.. అందులో 70 శాతం మంది మహిళలే ఉన్నారట. అంటే.. 14 లక్షల మంది మహిళలే కావడం గమనార్హం. మహాలక్ష్మీ పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం మొదలైన నాటి నుండి ఈ సంఖ్య పెరిగింది. ప్రభుత్వం ఇచ్చిన పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు తెలంగాణ నారీమణులు. జీరో టికెట్టుతో రాష్ట్ర వ్యాప్తంగా సిటీ ఆర్టీనరీ, మెట్రో, డీలక్స్, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ప్రయాణ సౌకర్యం ఉచితం కావడంతో ప్రతి రోజూ ఉద్యోగాలు, ఇతర అవసరాల కోసం బస్సుల్లో ప్రయాణీస్తున్నారు.

మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత ప్రయాణం ప్రారంభించిన కొత్తలో రోజు 16 లక్షల మంది ప్రయాణీకులు ప్రయాణిస్తుండగా.. ఇప్పుడు 20 లక్షల మంది రాకపోకలు సాగిస్తుండటం విశేషం. ఈ పథకం గత ఏడాది డిసెంబర్ 9న ప్రారంభమైంది. ఆనాటి నుండి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ప్రయాణీకులకు సుమారు 54 కోట్ల జీరో టికెట్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. పొదుపు చేయడంలో ముందు వరుసలో ఉండే నారీమణులు.. ఆర్థికంగా తమకు తాము న్యాయం చేసుకుంటూనే.. ఆర్టీసీని కూడా లాభాల బాట వైపు నడిపిస్తున్నారు. అలాగే రద్దీ ఉన్న ప్రాంతాల్లో పలు రూట్లలో బస్సుల సంఖ్యను పెంచుతూ.. మహిళల సౌకర్యవంతంగా ప్రయాణించేలా వెసులు బాటు కల్పిస్తోంది టీజీఎస్ఆర్టీసీ.

Show comments