TGSRTC Good News: ప్రయాణికులకు శుభవార్త.. TGSRTC మరో కీలక నిర్ణయం!

ప్రయాణికులకు శుభవార్త.. TGSRTC మరో కీలక నిర్ణయం!

TGSRTC Good News: తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పింది.

TGSRTC Good News: తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పింది.

గత ఏడాది చివర్లో శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ దిగ్విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి తనదైన మార్క్ చాటుకుంటున్నారు. ఎనికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో ఉన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనివల్ల చిరు వ్యాపారుల, ఉద్యోగులు, విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అంటున్నారు.ఇటీవల ఆర్టీసీలో ఎన్నో కీలక మార్పులు తీసుకువస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రయాణికుల కోసం TGSRTC మరో కీలక నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో ప్రయాణించే ప్రయాణికులు అదిరిపోయే శుభవార్త అందించింది టీజీఎస్ఆర్టీసీ. ఇకపై ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారు టికెట్ కొనుగోళ్ల విషయంలో ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. త్వరలో డిజిటల్ పేమెంట్స్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. బస్సుల్లో యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డులతో కూడిన డిజిటల్ పేమెంట్స్, స్మార్ట్ కార్డ్స్, మొబైల్ టికెట్స్, మొబైల్ బస్ పాస్ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు ఆయన తెలిపారు. దీని వల్ల చిల్లర లేక అటు ప్రయాణికులు, ఇటు కండెక్టర్ నానా అవస్థలు పడుతంటారు.. ఇలాంటి కష్టాలకు చెక్ పెట్టవొచ్చని అంటున్నారు.

డిజిటల్ చెల్లింపులకు సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ దిల్‌సుఖ్ నగర్, బండ్లగూడ డిపోల్లో అమలవుతుంది. ఈ నిర్ణయం ద్వారా చిల్లర కష్టాలు తీరమే కాదు.. టికెట్ తీసుకునే వారి సంఖ్య కూడా పెరిగిపోతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రోజుల్లో చాలా మంది యూపీఐ పేమెంట్స్ కోసం గుగుల్ పే, ఫోన్ పే, పేటిఎం లాంటి డిజిటల్ చెల్లింపుల అప్లికేషన్లు వాడుతున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆర్టీసీలో కూడా ఇలాంటి సేవలు అందుబాటు‌లోకి తేవడం వల్ల ప్రయాణికులకు ఎంతో మేలు జరుగుతుందని అంటున్నారు. ప్రయాణికుల సెక్యూరిటీ కోసం బస్సుల్లో డ్రైవర్ మానిటరింగ్ సిస్టం, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టంను సంస్థ అమలు చేయాలని నిర్ణయించినట్లు సజ్జనార్ తెలిపారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మహిళల ఉచిత బస్సు సౌకర్య పథకం దిగ్విజయంగా అమలువుతుంది. ఇప్పటి వరకు 77 కోట్ల మందికి పైగా మహిళలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చామని ఆయన అన్నారు. ఆర్టీసీ ప్రయాణికులకు మంచి సౌకర్యం అందించేందుకు ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ సంస్థల అమలు చేస్తుందని ఈ సందర్బంగా తెలిపారు.

Show comments