Dharani
Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ అంశంపై స్పందిస్తూ.. తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఆ వివరాలు..
Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ అంశంపై స్పందిస్తూ.. తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఆ వివరాలు..
Dharani
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెను సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. రోజు రోజుకి ఈ వ్యవహారంలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విపక్ష పార్టీ నేతల ఫోన్లు మాత్రమే కాక వ్యాపారవేత్తలు, సినీ సెలబ్రిటీల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది ఫోన్లు ట్యాప్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. సమంత, నాగచైతన్య విడాకులకు కారణం ఈ ఫోన్ ట్యాపింగే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సామ్, చై విడిపోయి ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికి వారి విడాకులపై ఏదో ఓ సందర్భంలో ఏదో ఓ వార్త వస్తూనే ఉంటుంది. అలాంటిది ఈ సారి రాజకీయ విశ్లేషకులు సైతం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భాగంగా.. వీరిద్దరి విడాకుల గురించి మాట్లాడటం తెలంగాణలో సంచలనంగా మారింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
తాజాగా తీన్మార్ మల్లన్న ఫోన్ ట్యాపింగ్ అంశంపై తన యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ నాగచైతన్య, సమంత విడిపోవడానికి కారణం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే అన్నారు. అంతేకాక బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఓ నేత సమంత ఫోన్ ట్యాప్ చేశారని తెలుస్తోందని మల్లన్న చెప్పారు. పైగా సదరు నేత కేవలం రాజకీయాలు మాత్రమే కాక.. మందుల వ్యాపారం కూడా నిర్వహిస్తున్నారని చెప్పుకొచ్చారు. దీనిపై త్వరలోనే పూర్తి వాస్తవాలు వెలుగులోకి వస్తాయి అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెరపైకి వచ్చాక తెలంగాణలో పొలిటికల్ సునామీ చెలరేగింది. మాజీ ప్రభుత్వంపై పార్టీలు మండిపడుతూ వస్తున్నాయి. కొందరు నేతలు మా ఫోన్లు ట్యాప్ చేశారంటూ డీజీపీకి ఫిర్యాదులు అందించారు. ముఖ్యంగా ఈ వ్యవహారంపై బీజేపీ నేత రఘునందన్‌రావు ఫోన్ ట్యాపింగ్ అంశంపై రాష్ట్ర డీజీపీకి కంప్లైంట్ చేశారు. అప్పటి సీఎం కేసీఆర్ ప్రమేయం లేకుండా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సాధ్యం కాదన్నారాయన. దీనిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని రఘునందన్‌రావు డిమాండ్ చేశారు.
ఇక బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆరు గ్యారెంటీల అమలుపై చేతులెత్తేసిన కాంగ్రెస్.. దాన్నుంచి ప్రజల దృష్టి మల్లించడానికే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెర మీదకు తెచ్చారని ఆరోపించారు. 10 లక్షల ఫోన్లను కేసీఆర్ ట్యాప్ చేశారని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుందని..చేస్తే గిస్తే ఒక్కరో ఇద్దరివో ఫోన్లు ట్యాపింగ్ చేసుండొచ్చన్నారు. దొంగల ఫోన్లు ట్యాపింగ్ చేయడమే పోలీసుల పని అన్నారు కేటీఆర్.