Swetha
Telangana Government: తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ విజయవంతంగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది. ఈ క్రమంలో తాజాగా మరికొన్ని కొత్త విధానాలను కూడా పరిచయం చేస్తుంది ఈ ప్రభుత్వం. తాజాగా డిజిటల్ కార్డ్స్ రూపొందించాలంటూ అధికారులకు రేవంత్ రెడ్డి సూచించారు. పూర్తి వివరాలను చూసేద్దాం.
Telangana Government: తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ విజయవంతంగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది. ఈ క్రమంలో తాజాగా మరికొన్ని కొత్త విధానాలను కూడా పరిచయం చేస్తుంది ఈ ప్రభుత్వం. తాజాగా డిజిటల్ కార్డ్స్ రూపొందించాలంటూ అధికారులకు రేవంత్ రెడ్డి సూచించారు. పూర్తి వివరాలను చూసేద్దాం.
Swetha
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది. అది మాత్రమే కాకుండా ప్రజలందరికి ఉపయోగపడే విధంగా కొత్త పథకాలను కూడా అందుబాటులోకి తీసుకుని వస్తుంది. ఇప్పటివరకు ఎక్కడా లేని విధంగా.. తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ కార్డ్స్ ను రూపొందించాలనే ప్రయత్నంలో ఉంది. తాజాగా రేవంత్ రెడ్డి .. రేషన్‌కు, హెల్త్ ప్రొఫైల్‌కు, సంక్షేమ పథకాలన్నింటికీ ఉపయోగపడేలా ఒక డిజిటల్ కార్డు ను రూపొందించాలని అధికారులకు సూచించారు. ‘వన్ స్టేట్.. వన్ డిజిటల్ కార్డు’ విధానంతో ముందుకు వెళ్లాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. అంతే కాకుండా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఈ డిజిటల్ కార్డు అందే ప్రయత్నాలు కూడా చేయనున్నట్లు సమాచారం. ఈ కొత్త విధానానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కొత్త డిజిటల్ కార్డ్స్ కు సంబంధించి..తాజాగా రేవంత్ రెడ్డి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ లాంటి ఉన్నత అధికారులతో .. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో చర్చలు జరిపారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఉండే పట్టణ , గ్రామీణ ప్రాంతాలను ఎంపిక చేసుకుని కొన్ని పైలెట్ ప్రాజెక్ట్స్ కింద.. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆదేశించారు. ఇక ఇప్పటికే రాజస్థాన్, హర్యానా, కర్నాటక లాంటి పలు రాష్ట్రాల్లో ఈ కార్డులు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి వాటిపై అధ్యయనం చేసి.. దాని వలన కలిగే ప్రయోజనాలు , ఇబ్బందులను గుర్తించి సమగ్ర నివేదికను రూపొందించాలని తెలియజేశారు. అంతే కాకుండా సంక్షేమ పథకాలు పొందే అర్హత ఉన్న వారందరికీ కూడా ఇవి అందాలని.. వీటితో ఎక్కడైనా సరే రేషన్ , ఆరోగ్య సేవలు పొందే వెసులుబాటు కలిగేలా ఉండాలని రేవంత్ రెడ్డి సూచించారు.
ఇక ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులో.. కుటుంబంలోని ప్రతి సభ్యునికి హెల్త్ ప్రొఫైల్ ఉండాలని.. అది దీర్ఘ కాలంలో వైద్య సేవలు పొందేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఇక ఈ కార్డులను కుటుంబంలోని మార్పులను బట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ కూడా చేసుకోవచ్చని తెలిపారు. అలాగే ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు సంబంధించిన మోనిటరింగ్ కు.. జిల్లాల వారీగా కొంతమంది స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా ఈ సమావేశంలో.. ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహలతో పాటు.. సీఎస్ శాంతికుమారి, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టియానా జడ్ చొంగ్తూ, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, సీఎం కార్యదర్శులు చంద్రశేఖర్‌రెడ్డి, సంగీత సత్యనారాయణ, పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ లాంటి వారు పాల్గొన్నారు. త్వరలోనే డిజిటల్ కార్డులకు సంబంధించిన పనులు మొదలు కానున్నట్లు సమాచారం. మరి ఈ కొత్త విధానం వలన రాష్ట్రంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.