50 రోజుల్లో రూ.8.72 కోట్లు ఫైన్..! చుక్కలు చూపిస్తున్న అధికారులు!

నిబంధనలు అతిక్రమిస్తూ రాకపోకలు సాగిస్తున్న స్కూల్ బస్సులపై రవాణా శాఖ కొరడా ఝళిపించింది. స్కూల్స్ రీ ఓపెన్ కాగానే.. ప్రత్యేకమైన డ్రైవ్ నిర్వహించారు రవాణా శాఖ అధికారులు. ఈ 50 రోజుల్లో ఫైన్ల రూపంలో కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి చేకూరింది.

నిబంధనలు అతిక్రమిస్తూ రాకపోకలు సాగిస్తున్న స్కూల్ బస్సులపై రవాణా శాఖ కొరడా ఝళిపించింది. స్కూల్స్ రీ ఓపెన్ కాగానే.. ప్రత్యేకమైన డ్రైవ్ నిర్వహించారు రవాణా శాఖ అధికారులు. ఈ 50 రోజుల్లో ఫైన్ల రూపంలో కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి చేకూరింది.

నిబంధనలకు వ్యతిరేకంగా వాహనాలు నడుపుతూ అమాయకులైన ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొందరరు. ఫిట్ నెస్ , సరైన డాక్యుమెంట్స్ లేని వాహనాలను వినియోగిస్తున్నారు. దీని వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి వాహనాలపై కొరడా ఝళిపించింది తెలంగాణ సర్కార్. నిబంధనలు ఉల్లంఘించిన వాటిలో ఎక్కువ శాతం స్కూల్ బస్సులే ఉండటం విశేషం. సమ్మర్ సెలవుల తర్వాత.. స్కూల్స్ తెరుచుకోగా.. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఫిట్ నెస్ లేని స్కూల్ బస్సులపై కూడా చర్యలు తీసుకుంటుంది. ఈ 50 రోజుల వ్యవధిలో 900కి పైగా వాహనాలను సీజ్ చేశారు అధికారులు. సరైన డాక్యుమెంట్స్, ఫిట్ నెస్ లేని వాహనాలను సీజ్ చేస్తున్నారు.

ఈ 50 రోజుల వ్యవధిలో 936 పైగా బస్సులను సీజ్ చేస్తే.. అందులో హైదరాబాద్‌లో 63 వాహనాలు ఉన్నాయి. నిబంధనలకు అతిక్రమంచిన వాహనాలకు జరిమానా విధించారు. ఈ వాహనాల నుండి ప్రభుత్వానికి రూ. 8.72 కోట్ల రూపాయల ఆదాయవ వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీటిలో పాటు కౌంపౌండబుల్ రుసుము కింద మరో 9.65 లక్షల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. నిబంధనలను ఉల్లంఘించిన వాహనాల్లో ఎక్కువగా మహానగరంలో ఉన్నట్లు చెబుతున్నారు. 63 బస్సులకు గానూ.. కోటిన్నర ఫైన్‌ల జరిమానా విధించినట్లు తెలిపారు. అలాగే మేడ్చల్ మల్కాజ్ గిరి ప్రాంతాల్లో మరో కోటిన్నర రూపాయల ఆదాయం ఫైన్ల రూపంలో వచ్చినట్లు రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు.

కేవలం నెలన్నర రోజుల్లో 8 కోట్లపై పైగా వాహనాల జరిమానాల రూపంలో రావడం గమనార్హం. అలాగే స్కూల్ బస్సుల నుండి కూడా కోట్లలో వసూలు అయ్యాయి. ఈ లెక్కన పిల్లల ప్రాణాలతో స్కూల్ యాజమాన్యాలు చెలగాటమాడుతున్నాయనడానికి ఓ ఉదాహరణ. ఫీజులు చూస్తే లక్షల్లో వసూలు చేస్తున్నారు తప్ప.. పిల్లలు ప్రయాణించే బస్సుల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఇక తప్పనిసరిగా ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాల్సిందేనని అధికారుల విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి డ్రైవ్ రానున్న రోజుల్లో కొనసాగిస్తామని, ప్రభుత్వ మార్గదర్శకాలు ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులు కచ్చితంగా పరీక్షలు చేయించుకుని సర్టిఫికెట్ ఉంటేనే రోడ్డు మీద తిప్పాలని ట్రాన్స్‌పోర్ట్ అధికారులు తెలిపారు.

Show comments