P Krishna
తెలంగాణలో నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల అమలకు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాలను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి.
తెలంగాణలో నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల అమలకు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాలను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి.
P Krishna
ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. పదేళ్ల పాటు కొనసాగిన బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనకు చెక్ పెడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. నాటి నుంచి తనదైన పాలన కొనసాగిస్తున్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో తమను గెలిపించారని.. వాళ్ల నమ్మకాన్ని నిలుపుకోవాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించారు. ఇప్పటికే ప్రగతి భవన్ ని ప్రజాభవన్ గా మార్చి ప్రజావాణి కార్యక్రమం మొదలు పెట్టారు. ఈ కార్యక్రమానికి భారీ రెస్పాన్స్ వస్తుంది.. ప్రజలు తమ అర్జీలతో తండోపతండాలుగా వస్తున్నారు. తాజాగా ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసం పెంచేలా ఓ ఎమ్మెల్యే వినూత్నమైన నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..
సాధారణంగా సెలబ్రెటీలు, రాజకీయ నేతలు తమకు.. తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకుంటారు. చిన్న అస్వస్థతకు గురైనా వెంటనే ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్లి చికిత్స చేయించుకుంటారు. కానీ కొంతమంది అధికారులు, ప్రజా ప్రతినిధులు తమ కుటుంబ సభ్యులను ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స చేయిస్తారు. ఎందుకేంటే ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులపై సరైన భరోసా రావాలని.. మెరుగులైన చికిత్స అందిస్తారన్న నమ్మకం కలిగించాలనే తాపత్రయం. ఇప్పుడు ఇదే పనిచేశారు ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జ. తనకు జ్వరం రావడంతో ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ఎమ్మెల్యేను పరీక్షించిన వైద్యులు టైఫాయిడ్ అని నిర్ధారించారు. 5 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించి.. కొన్ని మెడిసన్స్ అందించారు. సామాన్య ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం రావాలనే ఉద్దేశంతో తాను ప్రభుత్వ హాస్పిటల్ కి వచ్చినట్లు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జ అన్నారు.
రాజకీయాల్లో ఓ సామాన్యుడు రాణించడం కష్టం అన్న అందరి అభిప్రాయాన్ని మార్చి ఆదివాసీ గోండు బిడ్డ వెడ్మ బొజ్జ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన ఇందిరమ్మ ఇంట్లోనే ఉంటున్నారు. చిన్నప్పటి నుంచి పేపర్ బాయ్ గా పనిచేస్తూ చదువుకున్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్, ఆర్థిక స్థోమత లేకున్నా కాంగ్రెస్ పార్టీ అతనిపై నమ్మకంతో ఖానాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కేటాయించింది. బీజేపీ తరుపు నుంచి ఎంపీ రమేష్ రాథోడ్, బీఆర్ఎస్ నుంచి భుక్యా జాన్సన్ లు పోటీ చేశారు. వారందరి అంచనాలు తారుమారు చేస్తూ ఖానాపూర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి సంచలన విజయం సాధించి.. అసెంబ్లీలో అధ్యక్షా అనే స్థాయికి ఎదిగాడు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.