తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త! ఏకంగా 2 లక్షల ఉద్యోగాలు! కీలక ప్రకటన!

Duddilla Sridhar Babu: ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. జాబ్ క్యాలెండర్ పై అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు.

Duddilla Sridhar Babu: ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. జాబ్ క్యాలెండర్ పై అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు.

చాలా మంది యువత ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. ఈ క్రమంలో రేయింబవళ్లు కష్టపడి చదువుతుంటారు. అయితే ఇదే సమయంలో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ల కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటారు. అలానే తెలంగాణ నిరుద్యోగ యువత కూడా ప్రభుత్వం నుంచి ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే డీఎస్సీ వంటి వాటికి పోస్టులక భర్తీ పక్రియ జరుగుతుండగా..తాజాగా నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగల అంశంపై అసెంబ్లిలో  రాష్ట్ర మంత్రి  శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దా…

గతకొద్ది రోజుల నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసింది. అలానే రాష్ట్ర బడ్జెడ్ ను కూడా  ప్రవేశపెట్టి..కీలక శాఖలకు నిధులను కేటాయించారు. ఇది ఇలా ఉంటే..గురువారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశంలో తెలంగాణ సర్కార్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర పౌరఫరాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ బిల్లు ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగానే జాబ్ క్యాలెండర్ మంత్రి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తామని అన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో 2 లక్షల మందికి ఉద్యోగాలు భర్తీ చేయనున్నామని మంత్రి స్పష్టం చేశారు.  ప్రభుత్వ పరంగా అందరికీ ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదన్నారు. అలానే  గ్రాడ్యుయేట్లలో కంపెనీలకు కావాల్సిన నైపుణ్యాలు కొరవడ్డాయని తెలిపారు. వారిలో నైపుణ్యాలను పెంపొందించేందుకు పారిశ్రామక వేత్తలు, వీసీలు, విద్యార్థులతో చర్చించాలని అన్నారు. మంచి ఆశయంతోనే స్కిల్ యూనివర్సిటీని ప్రారంభిస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.

ఈ యూనివర్సిటీ  ద్వారా ఎంతోమంది నిరుద్యోగులకు చక్కటి ఉపాధి లభిస్తుందని..తద్వారా రాష్ట్రాభివృద్ది జరుగుతుందని ఆయన అన్నారు. తెలంగాణలో మరిన్ని పరిశ్రమల స్థాపనకు స్కిల్ యూనివర్సిటీ ఊతమిస్తుంది. 2024-25 సంవత్సరంలో 2 వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తామని, వచ్చే ఏడాదిలో 10వేల మందికి శిక్షణ ఇస్తామని మంత్రి తెలిపారు. ఈ యూనివర్సిటీకి సంబంధించి శాశ్వత క్యాంపస్ ముచ్చర్లలో ఏర్పాటు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఏది ఏమైనప్పటికీ.. గత ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువరించినా.. తక్కువ పోస్టులు, పేపర్ లీకేజీలు, పరీక్షల్లో అక్రమాలు, ఫలితాలు వెలువడకపోవడం వంటి వివిధ కారణాలతో వల్ల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఆలస్యంమైన సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీపై ఆశలు చిగురించాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామంటూ మంత్రి శ్రీధర్ బాబు చేసిన వ్యాఖ్యలపై నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Show comments