పర్యాటకుల మది దోచే మాల్దీవులు.. తెలంగాణలోనే.. ఎక్కడంటే?

Telangana mini Maldives Somasila: మీరు వీకెండ్ లో టూర్ ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే మాల్దీవులను చూసిన ఫీలింగ్ పొందాలనుకుంటున్నారా? అయితే తెలంగాణలోనే మినీ మాల్దీవులు ఉన్నాయి. ఇంతకీ అవి ఎక్కడున్నాయో తెలుసా?

Telangana mini Maldives Somasila: మీరు వీకెండ్ లో టూర్ ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే మాల్దీవులను చూసిన ఫీలింగ్ పొందాలనుకుంటున్నారా? అయితే తెలంగాణలోనే మినీ మాల్దీవులు ఉన్నాయి. ఇంతకీ అవి ఎక్కడున్నాయో తెలుసా?

మానసిక ఉల్లాసం కోసం చాలా మంది టూర్లకు వెళ్తుంటారు. వర్క్ నుంచి రిలీఫ్ కోసం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేందుకు పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తుంటారు. ఫ్రెండ్స్ అంతా కలిసి సరదాగా గడిపేందుకు విహార యాత్రలకు వెళ్తుంటారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలకు కొదవ లేదు. భారత్ లో కూడా రమణీయమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ప్రపంచంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా ఉంది. తాజ్ మహల్, గోల్డెన్ టెంపుల్, ఎర్రకోట వంటి అనేక చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయి. దేశంలోని రాజభవనాలు, అన్యదేశ వన్యప్రాణులు, ద్వీపాలు పర్యాటకులను ఎంతగాను ఆకర్షిస్తుంటాయి.

ప్రసిద్ధమైనవిగా చెప్పుకునే ప్రదేశాల్లో ఢిల్లీ, ఆగ్రా, సిమ్లా, మనాలి, కూర్గ్, ఊటీ, మన్నార్, గోవా, పాండిచ్చేరి, నైనిటాల్, మహాబలేశ్వర్, ఉదయపూర్, ద్వారక, సోమనాథ్, మదురై, అజంతా గుహలు, గ్యాంగ్ టక్, డార్జిలింగ్ అత్యంత ప్రసిద్ధమైనవి. దేశవ్యాప్తంగా అనేక రకాల మంచి పర్యాటక ప్రదేశాలు ఉన్నప్పటికీ.. తాజ్ మహల్, రాజస్థాన్, కేరళ, గోవా, వారణాసి, హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రముఖ పర్యాటక ప్రదేశాలు ముందు స్థానంలో ఉన్నాయి. అయితే మన దేశంలో అత్యంత అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నప్పటికీ ఎక్కువ మంది మల్దీవులకు వెళ్తుంటారు. అయితే పర్యాటకుల మది దోచే మాల్దీవుల కోసం అక్కడికి వెళ్లాల్సిన పని లేదండోయ్. తెలంగాణలో కూడా మినీ మాల్దీవులున్నాయి.

మీరు టూర్ కోసం ప్లాన్ చేసుకున్నట్లైతే తెలంగాణ మినీ మాల్దీవులుగా పిలవబడే సోమశిల బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ గా చెప్పొచ్చు. ఎక్కడికి వెళ్లాలి అనేదానిపై క్లారిటీ లేకపోతే బడ్జెట్ ధరలో సోమశిలను సందర్శించి మాల్దీవులను చూసిన ఫీలింగ్ పొందొచ్చు. తెలంగాణ మినీ మాల్దీవులుగా పిలవబడే సోమశిల హైదరాబాద్‌ నగరానికి దగ్గర్లోనే ఉంది. నాగర్ కర్నూల్ జిల్లాలో ఈ ప్రముఖ పర్యాటక ప్రాంతం ఉంటుంది. హైదరాబాద్ కు 180 కి.మీ దూరంలో ఉన్న సోమశిల.. నదీ జలాలు, పచ్చని అడవుల మధ్య పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతోంది. సోమశిలకు జాతీయ ఉత్తమ గ్రామీణ పర్యాటక ప్రాంతంగా అవార్డు కూడా దక్కింది. కృష్ణా నదీ తీర ప్రాంతంలో ఉండే సోమశిల ఒక ద్వీపం మాదిరిగా ఉంటుంది.

కృష్ణా బ్యాక్‌వాటర్ ఉండటంతో సోమశిల మాల్దీవుల్లో ఉన్నట్లుగా ద్వీపం అనుభూతిని పంచుతుంది. తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారు. టూరిజం శాఖ ద్వారా బోటింగ్ సదుపాయం కూడా ఉంది. పర్యాటకులు బస చేయటానికి కాటేజీలు కూడా నిర్మించారు. కృష్ణా నదీ తీరంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో బోటింగ్‌తో పాటుగా ప్రత్యేకంగా అక్కడ దొరికే చేప వంటకాలను రుచి చూడవచ్చు. ఈ ప్రాంతం నుంచి శ్రీశైలానికి బోటింగ్ ద్వారా చేరుకోవచ్చు. సోమశిలలో దాదాపు 15 దేవాలయాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది సోమశిల జలాశయంలో ఉండే సంగమేశ్వర ఆలయం.

అది నది గర్భంలో ఉండటంతో వర్షాకాలంలో నీటిమట్టం పెరిగి ఆలయం మొత్తం మునిగిపోతుంది. దీంతో ఆ సంగమేశ్వర ఆలయం ఏడాదిలో సగం కాలానికి పైగా నీటిలోనే ఉంటుంది. వేసవి సమీపించే సమయంలో భక్తులకు దర్శనమిస్తుంది. సోమశిలకు చేరుకోవడానికి నేషనల్ హైవే 65పై నుంచి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో సోమశిల గ్రామం ఉంటుంది. అక్కడకు చేరుకోవటానికి టూరిజం డిపార్ట్ మెంట్ నుంచి ప్రత్యేక బస్సులు కూడా ఉంటాయి. మరి మీరు కూడా వీకెండ్ లో టూర్ ప్లాన్ చేసుకుంటే తెలంగాణ మినీ మాల్దీవులను సందర్శించి సరదాగా గడిపేయండి.

Show comments