ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. 1 నిమిషం నిబంధన సడలింపు!

Good News for Inter Students: ఇంటర్ విద్యార్థులు పరీక్ష హాలుకు ఒక్క నిమిషం లేట్ అయినా అనుమతి లేదన్న నిబంధనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.

Good News for Inter Students: ఇంటర్ విద్యార్థులు పరీక్ష హాలుకు ఒక్క నిమిషం లేట్ అయినా అనుమతి లేదన్న నిబంధనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.

తెలంగాణలో ప్రస్తుతం ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయి. అయితే పరీక్ష కేంద్రానికి ఒక్క నిమిషం లేటు వచ్చినా హాల్ లోకి అనుమతించేది లేదని బోర్డు ఇటీవల కఠిన నిబంధన అమలు చేసింది.  అయితే ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన ట్రాఫిక్ వల్ల విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సరైన సమయానికి చేరుకోకపోవడంతో వారికి పరీక్షలు రాయనివ్వం లేదు అధికారులు. దీంతో విద్యార్థులు తీవ్ర మనస్థాపానికి గురైతున్నారు. మొన్న ఓ విద్యార్థి ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. వీటన్నింటిని దృష్టింలో ఉంచుకొని తెలంగాణ ఇంటర్ బోర్డు ఓ కీలక నిర్ణయం తీసుకొని విద్యార్థులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. వివరాల్లోకి వెళితే..

ఇంటర్ పరీక్షలకు రాసే విద్యార్థులకు తెలంగాణ ఇంటర్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. పరీక్ష హాలుకు ఒక్క నిమిషం లేట్ అయినా అంగీకరించడం లేదు.. అయితే ఈ నిబంధనను సడలింపు చేసింది. ఇకపై పరీక్షకు ఐదు నిమిషాలు ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించాలని నిర్ణయించింది. ఈ మేరకు నిర్ధిష్ట కారణాల వల్ల విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఆలస్యం అయితే 5 నిమిషాల గ్రేస్ పిరియడ్ ను అనుమతించాలని ఇంటర్మీడియట్ విద్యామండలి అధికారులు ఆయా జిల్లాల అధికార యంత్రాంగానికి సూచించింది. తెలంగాణలో ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ పరీక్షలు మొదలైన విషయం తెలిసిందే.  రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఇంటర్ ప్రధమ, ద్వితీయ పరీక్షలకు విద్యార్థులు ఉదయం 8.45 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యూకేషన్ ఒక ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

ఉదయం 9 గంటల తర్వాత ఆలస్యంగా వస్తే లోనికి అనుమతించలేదు. దీంతో ఆదిలాబాద్ కి చెందిన ఇంటర్ సెకండీయర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ఒక్క నిమిషం నిబంధన సడలించాలని డిమాండ్ తెరపైకి వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంటర్ బోర్డు ఒక్క నిమిషం నిబంధనను సడలించింది. విద్యార్థులకు పరీక్ష హాల్ లోకి చేరేందుకు ఐదు నిమిషాల గ్రేస్ పిరియడ్ కి అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది. దీంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

Show comments