దేశంలో అత్యధిక తాగుబోతులు తెలంగాణలోనే ఉన్నారు! : తీన్మార్ మల్లన్న

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తీన్మార్ మల్లన్న అంటే కొత్తగా పరిచయం అక్కరలేదు. ఓ ప్రముఖ ఛానల్ లో తీన్మార్ వార్తల్లో తనదైన తెలంగాణ యాసతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. తీన్మార్ మల్లన్న అసలు పేరు చింతపండు నవీన్ కుమార్. కొంత కాలంగా వివిధ ఛానల్స్ లో పనిచేసిన తీన్మార్ మల్లన్న సొంతగా క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ను ఏర్పాటు చేశాడు. గత కొంతకాలంగా ఆయన రాజకీయాల్లో చాలా యాక్టీవ్ గా కనిపిస్తున్నారు. తాజాగా తీన్మార్ మల్లన్న ఓ మీటింగ్ లో తెలంగాణ రాష్ట్రంలో మద్యం సేవించేవారి గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ పూర్తి చేసి హైదరాబాదులోని జె.ఎన్.టి.యు నుంచి ఎంబీఏ పూర్తి చేశాడు. పలు ఛానల్స్ లో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన కొంతకాలంగా తన సొంత ఛానల్ ఏర్పాటు చేసి రాజకీయ విశ్లేషన చేస్తున్నారు. 2015లో తెలంగాణ శాసన మండలికి జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల ఆయన ‘తెలంగాణ నిర్మాణ పార్టీ’ పెట్టబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే త్వరలో తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని రకాలుగు సిద్దమవుతున్నారు. ఇప్పటికే భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న రాబోయే ఎన్నికల్లో మేడ్చల్ అసెంబ్లీ నియోజవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో ఆయన ఓ సభలో మాట్లాడుతూ తెలంగాణలో మద్యం సేవించే వారి విషయం మాట్లాడుతూ.. దేశంలో అత్యధికంగా తాగుబోతులు ఉన్నది తెలంగాణలోనే అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఇది ఆయన ఏ ఉద్దేశంతో వ్యాఖ్యానించారో తెలియదు కానీ.. ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు రక రకాలుగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Show comments