బిగ్ బ్రేకింగ్.. సోమవారం సెలవు రద్దు?

ఇటీవల దేశంలో పండుగలు వస్తే సెలవులు ఎప్పుడు అన్న కన్ఫ్యూజన్ మొదలైంది. అధికారిక సెలవు ఒకటయితే.. పండగలు వచ్చేది మరో తేదీ అవుతుంది. దీంతో ఉద్యోగులు పండగ సెలవు ఎప్పుడా అన్న ఆలోచనలో పడిపోతున్నారు.

ఇటీవల దేశంలో పండుగలు వస్తే సెలవులు ఎప్పుడు అన్న కన్ఫ్యూజన్ మొదలైంది. అధికారిక సెలవు ఒకటయితే.. పండగలు వచ్చేది మరో తేదీ అవుతుంది. దీంతో ఉద్యోగులు పండగ సెలవు ఎప్పుడా అన్న ఆలోచనలో పడిపోతున్నారు.

భారత దేశంలో పండుగలు వచ్చాయంటే చాలు సందడి మొదలవుతుంది. వినాయ చవితి మొదలు కొని శ్రీరామ నవమి వరకు హిందులు సంప్రదాయబద్దంగా పండుగలు జరుపుకుంటారు. ఈ మద్య కాలంలో పండుల తేదీలు ఎప్పుడు అన్న విషయంలో సందిగ్ధత నెలకొంటుంది. ముఖ్యంగా సెలవుల విషయంలో ఈ కన్ఫ్యూజన్ మరీ ఎక్కువ అవుతుంది. మొన్న దసరా, ఇప్పుడు దీపావళి సెలవు విషయంలో సందిగ్ధత నెలకొంది. అయితే నిన్న దీపావళఇ సెలవుల్లో కీలక మార్పులు చేస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. క్యాలెండర్ లో, ప్రభుత్వం జారీ చేసిన పండగ సెలవుల జాబితాలో దీపావళి నవంబర్ 12 వ తేదీ అని ఉంది. అయితే ఈ సెలవు 13వ తేదీ అనగా సోమవారం కి మార్చి సెలవు దినంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సెలవుపై టీ సర్కార్ వెనక్కి తగ్గినట్లు సమాచారం అందుతుంది. వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల సందడి కనిపిస్తుంది. ఈ నెల 30న ఎన్నికలు, డిసెంబర్ 3 న ఫలితాలు రాబోతున్నాయి. ఈ క్రమంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రచారాలతో ఊదరగొడుతున్నారు. నిన్నటితో నామినేషన్ల పర్వం ముగిసింది. ఇదిలా ఉంటే దీపావళి పండుగ సెలవు ఎప్పుడు అన్న విషయంలో అందరూ కన్ఫ్యూజ్ అవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం దీపావళి సెలవుపై ఒక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే సోమవారం దీపావళి సెలవు ఇస్తే ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే నిన్నటితో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్లు గడువు ముగిసింది. అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లను సోమవారం పరిశీలించాల్సి ఉన్న నేపథ్యంలో ఆ రోజు సెలవు ఇస్తే.. ఎన్నికల షెడ్యూల్ ను ఒకరోజు ముందుకు మార్చాల్చి ఉంటుందని సీఈఓ కార్యాలయం ప్రభుత్వానికి బదులు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం సోమవారం సెలవు రద్దు చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే సెలవు ఉన్నట్టా..? లేనట్లా? అన్న విషయం అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

ఇదిలా ఉంటే క్యాలెండర్ ప్రకారం దీపావళి పండుగ సెలవు 12 ఉంది.. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన పండగ సెలవు జాబితాలో కూడా 12వ తేదీనే ఉంది. అయితే 12 వ తేదీన ఉన్న సెలవును 13వ తేదీన సాధారణ సెలవు దినంగా పేర్కొంటూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు మార్చిన సెలవు రోజును పాఠశాలలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, సంస్థలు, ప్రైవేట్ సంస్థలకు కూడా దీన్ని అమలు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలకు రెండో శనివారం, ఆదివారం, సోమవారం సెలవులు కలిసి వస్తాయని అనుకున్నారు. కానీ ఎన్నికల నేపథ్యంలో సర్కార్ సోమవారం సెలవు విషయంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది.. ఆ రోజు సెలవు రద్దు చేసే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

Show comments