Arjun Suravaram
PrajaPalana Website: తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ ఆరు గ్యారెంటీల అమలుపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఎక్కడా అవినీతికి, అర్హులైన వారికి నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే ప్రజల కోసం ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించిన ఓ వెబ్ సైట్ ను ప్రారంభించింది.
PrajaPalana Website: తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ ఆరు గ్యారెంటీల అమలుపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఎక్కడా అవినీతికి, అర్హులైన వారికి నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే ప్రజల కోసం ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించిన ఓ వెబ్ సైట్ ను ప్రారంభించింది.
Arjun Suravaram
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇక రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా అర్హులైన వారికి రూ.10 లక్షల బీమా సౌకర్యాన్ని ప్రారంభించారు. అలానే కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. 6 గ్యారెంటీల హామీలకు సంబంధించిన దరఖాస్తుల కోసం ప్రజాపరిపాలన కార్యక్రమాన్ని రేవంత్ సర్కార్ ప్రారంభించింది. ఇది డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు కొనసాగింది. కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన ఈప్రతిష్టాత్మక కార్యక్రమానికి జనం నుంచి విశేష స్పందన వచ్చింది. ఇక ఏ కారణం చేతనైన దరఖాస్తు చేసుకోని వారికి, దరఖాస్తు రిజెక్ట్ అయిన వారికి తెలంగాణ ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు కోనసాగిన ఈ ప్రజాపాలన కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,25,84,383 దరఖాస్తులు వచ్చాయి. ఇక ఆరు గ్యారెంటీల అమలు కోసం నిర్వహించిన ప్రజాపాలన దరఖాస్తుల పరిశీలన, తదుపరి పక్రియ కొనసాగుతుంది. డేటా ఏంట్రీ పూర్తయ్యాక వెబ్ సైట్ లో మీ దరఖాస్తు వివరాలు అందుబాటులో ఉంటాయి. ఈనెల 17వ తేదీ వరకు డేటా ఎంట్రీ పూర్తయ్యే అవకాశం ఉంది. డేటా ఎంట్రీ పూర్తయిన తరువాత అధికారులు అర్హుల జాబితాను ప్రకటించి వారికి పథకాలు అందజేస్తారు.
ప్రజా పాలన కార్యక్రమంలో చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. మరికొందరు దరఖాస్తు చేసుకోలేదు. అలాంటి వారికి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఇక నుంచి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇప్పటి వరకు ప్రజాపాలన కార్యక్రమంలో తీసుకున్న దరఖాస్తులన్నింటికీ ప్రత్యేక సాఫ్ట్ వేర్ ఏర్పాటు చేశారు. WWW.Prajapalana.telangana.gov.in పేరుతో ఈ వెబ్ సైట్ ను ప్రభుత్వం పారంభించింది. దీని ద్వారా మీ దరఖాస్తు స్థితి ఏమిటి అనేది తెలుసుకోవచ్చు. అంతేకాక ఏమైనా మార్పులు చేయాలన్న ఈ వెబ్ సైట్ లోకి వెళ్లి చేయవచ్చు. అంతేకాక ఫేక్ వెబ్ సైట్లను చూసి కూడా మోస పోవద్దు. అధికారికి వెబ్ సైట్లో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ఫోటోలు, రాష్ట్ర చిహ్నం ఉంటాయి. అంతేకాక ఆరు గ్యారెంటీల పేరుతో ఇందిర గాంధీ ఫోటో ఉంటుంది.
ఇక వెబ్ సైట్ లోకి వెళ్తే.. దరఖాస్తు ఫారం నెంబర్ అడుగుతుంది. అందులో మీ దరఖాస్తు చేసుకున్న ఫామ్ నంబర్ ను ఎంట్రీ చేయాలి. ఆ తరువాత ఓకే బటన్ ను ప్రెస్ చేస్తే.. మీ దరఖాస్తు స్టేటస్ తెలిసిపోతుంది. ఇదే సమయంలో కొందరు కేటుగాళ్లు ప్రజాపాలన కార్యక్రమం పేరుతో మోసాలసకు పాల్పడుతున్నారు. అలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీ దరఖాస్తు ఓకే అయిందంటూ కాల్ చేస్తూ..ఓటీపీ వివరాలు తెలుసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. అలాంటి మోసాలు జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది. ఫేక్ కాల్స్ ను నమ్మోద్దని తెలిపింది. అంతేకాక మీ దరఖాస్తు ఏస్థితిలో ఉందనేది.. ప్రభుత్వ వెబ్ సైట్ ద్వారా చూసుకోవచ్చు. అంతే తప్ప ఎటువంటి ఫేక్ కాల్స్ ను నమ్మాల్సిన అవసరం లేదు.