TG: పెన్షన్ దారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్!

పెన్షన్ దారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్!

Telangana Pension వృద్ధులకు రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షన్ ఇస్తున్న  సంగతి తెలిసిందే. ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క విధంగా వృద్ధులకు నగదు చెల్లిస్తుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ దారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆ వివరాలు...

Telangana Pension వృద్ధులకు రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షన్ ఇస్తున్న  సంగతి తెలిసిందే. ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క విధంగా వృద్ధులకు నగదు చెల్లిస్తుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ దారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆ వివరాలు...

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం అనేక పథకాలను అమలు చేస్తుంటాయి. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికి వివిధ స్కీమ్ ను అమలు చేస్తుంటాయి. అలానే రైతులకు, మహిళలకు కూడా అనేక ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చే స్కీమ్స్ ను ప్రభుత్వాలు ప్రారంభిస్తుంటాయి. ఇది ఇలా ఉంటే.. వృద్ధులకు రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షన్ ఇస్తున్న  సంగతి తెలిసిందే. ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క విధంగా వృద్ధులకు నగదు చెల్లిస్తుంది. అలానే ఈ పెన్షన్ లో కూడా రాష్ట్రానికో విధానం ఉంటుంది. అలానే తెలంగాణ ప్రభుత్వం కూడా వృద్ధులకు పెన్షన్ అందిస్తుంది. అయితే పెన్షన్ పొందే లబ్ధిదారులకు తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ప్రస్తుతం తెలంగాణలో 60 ఏళ్లు పైబడిన వారికి పెన్షన్ ను అందిస్తున్నారు. అదే విధంగా వికలాంగులకు, వింతవులకు కూడా ప్రభుత్వం పెన్షన్ ను అందిస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్ నాలుగే వేల రూపాయల పెన్షన్ ను అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే 60 ఏళ్ల పై బడి ఎంత వయస్సు ఉన్న కూడా అందరికీ ఒకే తీరులో పెన్షన్ అందిస్తున్నారు. అయితే ఇది అన్నిరాష్ట్రాల్లో ఉన్న తీరు. అయితే తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ విషయంలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది.  రాష్ట్రంలో 70ఏళ్లు పైబడిన పెన్షన్ దారులకు, కుటుంబ పెన్షన్దారులకు అదనపు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పే రీవిజన్ కమిషన్ సిఫారసుల మేరకు రాష్ట్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం ఈ నూతన ఉత్తర్వూలను ఆర్థిక శాఖ జారీ చేసింది. ఈ క్రమంలోనే పలు అంశాలను ప్రస్తావించింది.

ఇక పెన్షన్ తీసుకుంటున్న వారిలో 70 నుంచి 75 ఏళ్లు పైబడిన వారికి బేసిక్ పెన్షన్ పై 15 శాతం అదనంగా ఇవ్వనున్నారు. అలానే 75 నుంచి 80 ఏళ్ల లోపు వారికి 20శాతంగా నిర్ణయించారు. అదే విధంగా 80 నుంచి 85 ఏళ్ల లోపు వారికి 30శాతం, 90 నుంచి 95 ఏళ్ల లోపు వారికి 50శాతం అదనంగా పెన్షన్ అందించనున్నారు. ఇక  95 నుంచి 100 ఏళ్ల లోపు వారికి 60శాతం, 100ఏళ్లకు పైబడిన పెన్షనర్లకు, కుటుంబ పెన్షన్దారులకు 100శాతం అదనంగా పెన్షన్ ఇవ్వనుదని సమాచారం. మొత్తంగా ఇది పెన్షన్  దారులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. ముఖ్యంగా మహిళకు ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల గ్యాస్ ను అందిస్తున్నారు.

Show comments