రైతన్నలకు గుడ్ న్యూస్.. ధరణిపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్తను అందించింది. భూ సమస్యలు పరిష్కరించేందుకు ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శకాలు జారీ చేసింది.

రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్తను అందించింది. భూ సమస్యలు పరిష్కరించేందుకు ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శకాలు జారీ చేసింది.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీల అమలుకు ప్రణాళికలు రచిస్తూ ముందుకు సాగుతోంది. రాష్ట్ర అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రైతాంగానికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. రైతుల భూ సమస్యలు తీర్చేందుకు ధరణి పోర్టల్ ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గత ప్రభుత్వ హయాంలో ప్రవేశ పెట్టిన ధరణి భూ సమస్యలను తీర్చకపోగా కొత్త సమస్యలను తెచ్చిపెట్టింది. ఒకరి భూములు మరొకరి పేరు మీద, విస్తీర్ణంలో తేడాలు, భూకబ్జాలు, ఇలా ఎన్నో వివాదాలకు కారణమైంది ధరణి పోర్టల్. తాజాగా ధరణి భూవివాదాల పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది.

తెలంగాణ రాష్ట్రంలో భూములుండి పట్టాలు కాని రైతులు ఇంకా చాలా మందే ఉన్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శకాలు జారీ చేసింది. ధరణి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారాలను కింది స్థాయి అధికారులకు బదలాయించింది. ధరణి సమస్యల పరిష్కార అధికారాలను ప్రభుత్వం తహశీల్ధార్లు, ఆర్డీవోలకు, కలెక్టర్లకు బదలాయించింది. తహశీల్ధార్లు, ఆర్డీవోలు, జిల్లా స్థాయి అధికారులకు, సీసీఎల్‌ఏకు అధికారాలను బదలాయిస్తునట్లు మార్గదర్శకాల్లో పేర్కొంది.

పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించేందుకు మార్చి 1నుంచి 9వరకు తహశీల్ధార్ కార్యాలయాల వద్ద స్పేషల్ డ్రైవ్ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. పెండింగ్ దరఖాస్తులను క్లియర్ చేసేందుకు నిర్ణీత గడువు విధించింది. తహశీల్ధార్ 7రోజుల్లో, ఆర్డీవో 3రోజుల్లో, అదనపు కలెక్టర్‌(రెవెన్యూ) 3రోజుల్లో, కలెక్టర్ 7రోజుల్లో పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని ఆదేశించింది. ఈ మార్గదర్శకాలతో రైతుల భూ సమస్యలు త్వరగా పరిష్కారం కానున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Show comments