P Venkatesh
తెలంగాణలో టెన్త్ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టెన్త్ ఫలితాలు విడుదలకు సిద్ధమయ్యాయి. విద్యాశాఖ అధికారులు టెన్త్ ఫలితాల విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు.
తెలంగాణలో టెన్త్ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టెన్త్ ఫలితాలు విడుదలకు సిద్ధమయ్యాయి. విద్యాశాఖ అధికారులు టెన్త్ ఫలితాల విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు.
P Venkatesh
రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో టెన్త్ విద్యార్థులకు తెలంగాణ విద్యాశాఖ గుడ్ న్యూస్ అందించింది. మరికొన్ని రోజుల్లో టెన్త్ విద్యార్థుల భవితవ్యం తేలిపోనున్నది. తాజాగా తెలంగాణలో టెన్త్ ఫలితాలను విడుదల చేసేందుకు తేదీని ఫిక్స్ చేశారు అధికారులు. ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు ఫలితాలను రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. పదో తరగతి ఫలితాలను పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. ఫలితాల విడుదల నేపథ్యంలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మార్చి నెల 18 నుంచి ఏప్రిల్ రెండో తేదీ వరకు జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఇక ఇప్పటికే ఫలితాల ప్రకటనకు ఎన్నికల కమిషన్ నుంచి విద్యాశాఖ అనుమతి కూడా పొందింది. ఇక ఇంటర్ పరీక్షల ఫలితాల విడుదల తేదిని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు ఈ నెల 24వ తేదీ ఉదయం 11 గంటలకు రిలీజ్ కానున్నాయి. ఈసారి మొదటి, రెండో సంవత్సరం పరీక్షల ఫలితాలు అధికారులు ఒకేసారి విడుదల చేయనున్నారు. ఇంటర్ ఫలితాలను విద్యార్థులు https://tsbie.cgg.gov.in, http://results.cgg.gov.in వెబ్‌సైట్ల నుంచి పొందవచ్చు.
ఇక ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. మెరుగైన ఫలితాలతో విద్యార్థులు సత్తా చాటారు. ఈ నెల 22న విడుదలైన పదోతరగతి ఫలితాల్లో ఓ విద్యార్థిని ఏకంగా 600కు 599 మార్కులు సాధించి స్టేట్ టాపర్ గా నిలిచింది. ఇదే విధంగా మరికొంత మంది విద్యార్థులు టెన్త్, ఇంటర్ ఫలితాల్లో మెరిసారు. పరీక్ష ఫలితాల్లో అత్యత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.