అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ వేసిన సర్పంచ్ నవ్య!

సర్పంచ్ నవ్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి రాజయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆమె వార్తల్లో నిలిచారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల వేళ మరో సంచలన నిర్ణయంతో వార్తల్లోకి ఎక్కారు.

సర్పంచ్ నవ్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి రాజయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆమె వార్తల్లో నిలిచారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల వేళ మరో సంచలన నిర్ణయంతో వార్తల్లోకి ఎక్కారు.

తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వివాదంతో జానకీపురం సర్పంచ్ నవ్య తెర మీద కొచ్చారు. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన వార్తలు ట్రెండ్ అవుతున్నీయి. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ మరోసారి ఆమె వార్తల్లో నిలిచింది. అది కూడా అందరిని ఆశ్చర్యపరిచేలా.. ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల బరిలో ఆమె కూడా స్టేషన్ ఘన్ పూర్‌లో పోటీకి సిద్ధమైంది. ఈ మేరకు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసింది. అయితే.. తాను ఎందుకు పోటీ చేస్తున్నాను అనే విషయంపై ఆమె క్లారిటీ ఇచ్చారు. ఆమె చెప్పిన సమాధానలతో  చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనేక ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఓ పక్క ప్రధాన పార్టీలతో పాటు చిన్న చిన్న పార్టీలు కూడా ఈసారి ఎన్నికల్లో బరిలో దిగుతున్నాయి. మరోవైపు స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. జానకీపురం సర్పంచ్ నవ్య కూడా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్నారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలోని జానకీపురం సర్పంచ్ నవ్య.. స్థానిక ఎమ్మెల్యే టి.రాజయ్య వేధింపులకు గురి చేశాడని ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో అనంతరం ఆమె సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్ అయ్యారు. ఓ ఎమ్మెల్యే స్థాయిలో ఆమెకు పేరు వచ్చిందనడంలో అతిశయోక్తిలేదు.

యూట్యూబ్ ఇంటర్యూలతో సామాజిక మధ్యమంలో  వైరల్ కంటెంట్ గా ఆమె మారిపోయారు. అంతేకాక ఓ చిన్నసైజు సెలెబ్రిటీగా ఆమె మారిపోయారు. ఆడవాళ్లకు ఏ కష్టం వచ్చినా తాను స్పందిస్తానని ఇంటర్వ్యూల్లో చెప్తూ.. ఫేమస్ అయిపోయారు. ఆమె నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, తెలంగాణ రాష్ట్రంలో తొలి ఉపముఖ్యమంత్రిగా  పని చేసిన తాటికొండ రాజయ్యపై తీవ్ర విమర్శలే చేశారామె. తాజాగా నవ్వ చేసిన ఆరోపణల వల్లే తాటికొండ రాజయ్యకు టికెట్ రాలేదన్న వాదనలు కూడా  ఉన్నాయి. కేసీఆర్ తనకు అవకాశం ఇస్తే.. స్టేషన్ ఘన్ పూర్ లో ఎమ్మెల్యేగా నామినేషన్ వేసేందుకు తాను  సిద్ధంగా ఉన్నానంటూ ఆ మధ్య మీడియాతో  నవ్వ.. తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అన్నట్లుగానే.. ఇప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగడం ఆసక్తికరంగా మారింది.

ఇక తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం నవ్య స్పందించారు. అయితే.. తాను నామినేషన్ వేయడం వెనుక ఎవ్వరి మీద పగ గానీ, కోపం గానీ లేదని.. కేవలం రాజకీయంగా ఎదగాలన్న ఉద్దేశం, ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యమే ఉందని ఆమె తెలిపారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం వంద శాతం అందరికీ సమాన హక్కులుంటాయని.. అందులో మహిళలకు కూడా అవి వర్తిస్తాయని నవ్య పేర్కొన్నారు. అందుకే తాను ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకొచ్చానన్నారు. మరి.. స్వతంత్ర అభ్యర్థిగా సర్పంచ్ నవ్య పోటీ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments