కష్టానికి దక్కిన ఫలితం.. DSCలో మెరిసిన అన్నదమ్ములు, తండ్రీకొడుకులు

Telangana DSC: తెలంగాణ డీఎస్సీ ఫలితాల్లో అద్భుతం చోటుచేసుకుంది. ఒకేసారి తండ్రీకొడుకులు, అన్నదమ్ములు ర్యాకులు కైవసం చేసుకున్నారు. వారి కుటుంబాల్లో ఆనందం వెల్లువిరిసింది.

Telangana DSC: తెలంగాణ డీఎస్సీ ఫలితాల్లో అద్భుతం చోటుచేసుకుంది. ఒకేసారి తండ్రీకొడుకులు, అన్నదమ్ములు ర్యాకులు కైవసం చేసుకున్నారు. వారి కుటుంబాల్లో ఆనందం వెల్లువిరిసింది.

తెలంగాణలో ఇటీవల టీచర్ ఉద్యోగాల భర్తీకోసం డీఎస్సీ నిర్వహించారు. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 11 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల కోసం లక్షలాది మంది పోటీపడ్డారు. తెలంగాణ డీఎస్సీకి సంబంధించిన పరీక్షలు జులైలో నిర్వహించారు. వీటికి సంబంధించిన ఫలితాలు సెప్టెంబర్ 30న విడుదలయ్యాయి. డీఎస్సీ రిజల్ట్స్ ను సీఎం రేవంత్ రెడ్డీ రిలీజ్ చేశారు. ఈ డీఎస్సీ ఫలితాల్లో పలువురు సత్తాచాటారు. అసాధారణ ప్రతిభతో ర్యాంకులను కొల్లగొట్టారు. ఈ ఫలితాల్లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. తెలంగాణ డీఎస్సీలో తండ్రీకొడుకులు, అన్నదమ్ములు ఒకేసారి మెరిసారు. ఎంతో కాలంగా వారు పడ్డ కష్టానికి తగిన ఫలితం దక్కింది.

కష్టపడితే చాలు ఫలితం వెతుక్కుంటూ వస్తుందని నిరూపించారు. టీచర్ జాబ్ సాధించడమే లక్ష్యంగా చేసిన ప్రయాణంలో వారు సఫలీకృతమయ్యారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా లక్ష్యాన్ని ఛేదించారు. ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలన్న వారి కల నెరవేరబోతోంది. డీఎస్సీలో మెరుగైన ర్యాంకులు సాధించడంతో వారి కుటుంబాల్లో సంతోషం వెల్లువిరిసింది. డీఎస్సీలో ఒకేసారి అన్నదమ్ములు, తండ్రీకొడుకులు ర్యాంకులు సొంతం చేసుకోవడంతో వారిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ అరుదైన ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది.

నారాయణ పేట జిల్లా మరికల్ మండలం రాకొండ గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు, కోస్గీ మండలం ముక్తిపహాడ్ గ్రామానికి చెందిన అన్నదమ్ములు డీఎస్సీ ఫలితాల్లో సత్తాచాటారు. రాకొండకు చెందిన 50 ఏళ్ల జంపుల గోపాల్, ఆయన కొడుకు భానుప్రకాశ్ మెరుగైన ర్యాంకులు సొంతం చేసుకున్నారు. గోపాల్ తెలుగు పండిట్ కేటగిరీలో జిల్లాస్థాయిలో ఫస్ట్ ర్యాంక్, స్కూట్ అసిస్టెంట్ విభాగంలో మూడో ర్యాంకు పొందారు. భానుప్రకాశ్ జిల్లా స్థాయిలో గణితంలో స్కూల్ అసిస్టెంట్ 9వ ర్యాంకు సాధించాడు.

తండ్రీకొడుకులిద్దరు ఒకేసారి ఉపాధ్యాయులు కాబోతుండడంతో వారిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే జిల్లాకు చెందిన అన్నదమ్ములు డీఎస్సీలో సత్తాచాటారు. కోస్గీ మండలం ముక్తిపహాడ్ గ్రామానికి చెందిన ఈడ్గి కష్ణయ్య స్కూల్ అసిస్టెంట్ విభాగంలో జిల్లా స్థాయిలో రెండో ర్యాంకు సాధించాడు. ఆయన సోదరుడు ఈడ్గి రమేశ్ ఎస్జీటీ విభాగంలో 11వ ర్యాంకు కొల్లగొట్టాడు. అన్నదమ్ములిద్దరు ర్యాంకులు సాధించడంతో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మరి తెలంగాణ డీఎస్సీలో తండ్రీకొడుకులు, అన్నదమ్ములు ర్యాంకులు కొల్లగొట్టిన అరుదైన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments