తెలంగాణ: జనవరిలో మరో ఎన్నికల నగరా.. త్వరలో నోటిఫికేషన్!

గత నెలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల హడావుడి కొనసాగింది. ఈ నెల 3న ఎన్నికల ఫలితాలు వచ్చాయి.. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది.

గత నెలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల హడావుడి కొనసాగింది. ఈ నెల 3న ఎన్నికల ఫలితాలు వచ్చాయి.. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది.

తెలంగాణలో మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికల హడావుడి కొనసాగింది. ఎన్నికల సమయంలో ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్న చందంగా ప్రచారాలతో ఊదరగొట్టాయి. గెలుపుపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేసుకుంటూ వచ్చాయి. ఈ నెల 3న ఫలితాలు వెలువడ్డాయి.. కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్లు రావడంతో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్దం చేస్తుంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నేడు ఎల్ బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పుడు తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో ఎన్నికల సంఘం నుంచి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి ఎన్నికల సందడి షురూ కాబోతుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు త్వరలో నగారా మోగనుంది. ఈ మేరకు డిసెంబర్ చివరి వారంలో నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. నిన్నమొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికలతో హడావుడిగా కొనసాగిన గ్రామాలు ఇప్పుడు ‘పంచాయతీ’ పోరుకు సిద్దం కాబోతున్నాయి. అందుకు సంబంధించిన కసరత్తు ప్రారంభం అయినట్లు తెలుస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్ల కు ఉత్తర్వులు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. గత ఏడాది సర్పంచ్ ఎన్నికలు 2019 జనవరి లో మూడు దశల్లో జరిగాయి. గ్రామాల్లో ఫిబ్రవరి 1 నాటికి సర్పంచ్ సహా కొత్త కార్యవర్గం నియమించబడ్డారు. వీరి పదవీ కాలం ఫివ్రవరి 1 తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం.. ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలు ప్రకటించాల్సి ఉంటుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ప్రచారాల వేడి తగ్గలేదు.. ఈ క్రమంలోనే పంచాయతీ పోరుకు నగరా ఎప్పుడు మోగుతుందా అని ప్రజలు, ఆశావాహులు ఎదురు చూస్తుంటారు. గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు పోటీ చేసే అభ్యర్థులు.

ఎన్నికల రిటర్నింగ్ అధికారుల, పోలింగ్ అధికారుల నియామకం, విధుల్లో పాల్గొనబోతున్న సిబ్బందికి శిక్షణ ఇవ్వడం లాంటి కార్యక్రమాలు ప్రారంభించేందుకు కలెక్టర్లకు ఎన్నికల సంఘం సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శకి అశోక్ కుమార్ పేరుతో ఈ నెల 4న ఉత్తర్వులు జారీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామ కార్యదర్శులు.. సర్పంచ్, వార్డు మెంబర్ లకు సంబంధించిన రిజర్వేషన్లపై సమాచారం పంపించారు. గతంలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు 10 సంవత్సరాలకు వర్తించేలా రాష్ట్ర ప్రభుత్వం 2019లో చట్టం చేసింది. గత ఏడాది రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పాటైన పంచాయతీలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 13 వేలకు పైగా గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది బ్యాలెట్ పద్దతిలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది. ఇందులో నోటా గుర్తు కూడా ఉంటుంది. చేతులు ఎత్తి ఉప సర్పంచ్ ని ఎన్నుకుంటారు.. ఇది పాత విధానం. ఏదైనా సమస్యల కారణంగా ఆరోజు ఉప సర్పంచ్ ని ఎన్నుకోకపోతే.. మరుసటి రోజు ఆ అవకాశం ఉంటుందని అంటున్నారు. తెలంగాణలో మరో ఎన్నికల నగారా.. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments