Venkateswarlu
‘ మామ! నా పాలు కొట్టిన బండి’’ అంటూ అక్కడున్న వారికి స్కూటర్‌ను పరిచయం చేశారు. తర్వాత కొంతమంది స్కూటర్‌పై ఉన్న మల్లారెడ్డితో ఫొటోలు దిగారు.
‘ మామ! నా పాలు కొట్టిన బండి’’ అంటూ అక్కడున్న వారికి స్కూటర్‌ను పరిచయం చేశారు. తర్వాత కొంతమంది స్కూటర్‌పై ఉన్న మల్లారెడ్డితో ఫొటోలు దిగారు.
Venkateswarlu
‘‘ అదృష్టం.. కష్టపడ్డా.. పని చేసినా.. సక్సెస్ అయిన.. పాలమ్మినా.. పూలమ్మినా.. ’’ ఈ ఒక్క డైలాగ్‌తో సోషల్ మీడియాలో పిచ్చ పాపులారిటీ తెచ్చుకున్నారు మంత్రి మల్లారెడ్డి. ఈ డైలాగ్‌కు స్పూఫులు, మీమ్స్ చాలానే పుట్టుకొచ్చాయి. ఇక, అసలు విషయానికి వస్తే.. మల్లారెడ్డి గతంలో పాలు, పూలు అమ్మిన స్కూటర్‌పై తాజాగా చక్కర్లు కొట్టారు. ఆ బైకుపై తిరుగుతూ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే.. సోమవారం దసరా పండుగ సందర్భంగా మల్లారెడ్డి జమ్మిపూజకు వెళ్లారు.
సికింద్రాబాద్ బోయిన్‌పల్లి కంటోన్మెంట్ గ్రౌండ్‌లో ఈ జమ్మిపూజ జరిగింది. జమ్మిపూజ చేస్తుండగా మల్లారెడ్డికి తన పాత చేతక్ స్కూటర్ కనిపించింది. దీంతో ఆయనకు గత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. వెంటనే దాని దగ్గరకు వెళ్లారు. దాన్ని స్టార్ట్ చేసి గ్రౌండ్‌లో చక్కర్లు కొట్టారు. దానిపై తిరుగుతున్నంత సేపు ఆయన ఎంతో సంతోషపడ్డారు. ‘‘ మామ! నా పాలు కొట్టిన బండి’’ అంటూ అక్కడున్న వారికి స్కూటర్‌ను పరిచయం చేశారు. తర్వాత కొంతమంది స్కూటర్‌పై ఉన్న మల్లారెడ్డితో ఫొటోలు దిగారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ మంత్రి మల్లారెడ్డి చాలా గ్రేట్’’.. ‘‘ ఇలాంటి వారు అందరికీ స్పూర్తిదాయకం’’.. ‘‘ ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మనస్తత్వం మల్లారెడ్డిది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, మంత్రి మల్లా రెడ్డి తాను పాలు, పూలు అమ్మిన చేతక్ స్కూటర్‌పై చక్కర్లు కొట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.