రాష్ట్రంలో రెండ్రోజులు భారీ వర్షాలు.. నగరవాసులకు IMD బిగ్ అలర్ట్..!

గత వారం రోజుల నుంచి నగరంలో వర్షాలకు కాస్త బ్రేక్ వచ్చింది. అయితే తాజాగా రాష్ట్రంలో నేటి నుంచి వర్షాలు పడే అవకాశం ఉందని వాతవరణ శాఖ అధికారులు వెల్లడించారు. పైగా కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను కూడా జారీ చేశారు.

గత వారం రోజుల నుంచి నగరంలో వర్షాలకు కాస్త బ్రేక్ వచ్చింది. అయితే తాజాగా రాష్ట్రంలో నేటి నుంచి వర్షాలు పడే అవకాశం ఉందని వాతవరణ శాఖ అధికారులు వెల్లడించారు. పైగా కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను కూడా జారీ చేశారు.

దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో వాగులు, కాలువలు, చెరువులు పొంగిపోయి జలమయం అవుతున్నాయి. ముఖ్యంగా నగరంలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కారణంగా లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కానీ, గత వారం రోజుల నుంచి నగరంలో వర్షాలకు కాస్త బ్రేక్ వచ్చింది. అయితే తాజాగా రాష్ట్రంలో నేటి నుంచి వర్షాలు పడే అవకాశం ఉందని వాతవరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇకపోతే అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. పైగా కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను కూడా జారీ చేశారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజాగా వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని నేటి నుంచి పలు జిల్లాల్లో వర్షాలు కురస్తాయని తెలిపింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో రుతుపవనాలు చాలా యాక్టివ్‌గా ఉన్నాయని, దీని వల్ల తెలుగు రాష్ట్రాలపై కూడా ద్రోణి ప్రభావం ఉందన్నారు. ఇకపోతే గుజరాత్, కేరళ దగ్గర మరో ద్రోణి కొనసాగుతుందని చెప్పారు. ఈ ప్రభావమే నేడు, రేపు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని వర్షాలు కురుస్తాయని అన్నారు. అలాగే నేటి సాయంత్రం 4 తర్వాత పశ్చిమ తెలంగాణలో తేలికపాటి జల్లలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వెల్లడించారు. ముఖ్యంగా సిరిసిల్ల, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, మంచిర్యాల, కొత్తగూడెం, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్‌, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలో అధికారులు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు.

అలాగే రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు భారీ ఈదురు గాలులు వీస్తాయన్నారు. అయితే గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతవరణ శాఖ వెల్లడించింది. అంతేకాకుండా.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం కురిసే సమయంలో అవసరం అయితేనే బయటకు రావాలని సూచించారు. దీంతో పాటు ఉత్తరాది రాష్ట్రాలైనా ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్, జార్ఖండ్, బీహార్‌లలోనూ నేడు చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు వెల్లడించారు. మరీ, తెలంగాణ రాష్ట్రంలో నేడు రేపు వర్షాలు పడే సూచనలు ఉన్నయని ఐఎండీ పేర్కొనడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments