Smita Sabharwal: స్మితా సబర్వాల్‌ సంచలన పోస్ట్‌.. వారికి రిజర్వేషన్లు ఎందుకంటూ

Smita Sabharwal- AIS Disability Quota: ఐఏఎస్‌ అధికారి సంచలన పోస్ట్‌ చేశారు. అది కూడా కూడా రిజర్వేషన్లకు సంబంధించి. దాంతో ఇప్పుడిది నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

Smita Sabharwal- AIS Disability Quota: ఐఏఎస్‌ అధికారి సంచలన పోస్ట్‌ చేశారు. అది కూడా కూడా రిజర్వేషన్లకు సంబంధించి. దాంతో ఇప్పుడిది నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

ఐఏఎస్‌ స్మితా సబర్వాల్‌ ఈమధ్య కాలంలో తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆమె మీద సోషల​ మీడియా వేదికగా పలువురు ఆరోపణలు, విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఆ సంగతి అలా ఉచితే.. సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే స్మితా సబర్వాల్‌.. తాజాగా సంచలన పోస్ట్‌ చేశారు. దాంతో అది కూడా అఖిల భారత సర్వీసుల(ఆల్‌ ఇండియా సర్వీసెస్‌-ఏఐఎస్‌) ల మీద పోస్ట్‌ చేయడంతో దీనిపై నెట్టింట తీవ్ర దుమారం రేగుతుంది. చాలా మంది స్మితా సబర్వాల్‌ తీరును తప్పు పడుతుండగా.. కొందరు మాత్రం ఆమె మాటలతో ఏకీభవిస్తున్నారు. ఇంతకు ఏం జరిగింది.. అసలు స్మితా సబర్వాల్‌ దేని గురించి పోస్ట్‌ చేశారు అంటే..

దివ్యాంగుల రిజర్వేషన్ల మీద సంచలన పోస్ట్‌ చేశారు ఐఏఎస్‌ అధికారి స్మితా సబర్వాల్‌. దివ్యాంగులకు గౌరవం ఇవ్వాల్సిందే అంటూనే.. అంత్యత కీలక సర్వీసులకు ఈ కోటా ఎందుకంటూ ప్రశ్నించారు. ‘‘దివ్యాంగులు అంటే ఎంతో గౌరవం ఉంది. కానీ ఒక సందేహం.. ఎవరైనా ఎయిర్‌లైన్‌ వాళ్లు.. వికలాంగులను పైలెట్‌గా నియమిస్తారా.. వికలాంగ సర్జన్‌ని నమ్మి.. జనాలు అతడి వద్ద చికిత్స తీసుకోగలరా.. మరి అఖిల భారత సర్వీసుల్లో ఎందుకు. ఇక్కడ ఫీల్డ్‌ వర్క్ ఎక్కువ.. పని వేళలు కూడా అధికంగానే ఉంటాయి. మరి ఈ ఉద్యోగాల్లో మాత్రం రిజర్వేషన్లు ఎందుకు. అవి కేవలం డెస్కుల్లో పని చేసే ఉద్యోగాలకు మాత్రమే వర్తిస్తే బాగుంటుంది’’ అంటూ  స్మితా సబర్వాల్ ట్వీట్‌ చేశారు.

 

ఈ క్రమంలోనే.. ట్రైయినీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వ్యవహారంలో యూపీఎస్సీ ఛైర్మన్ రాజీనామా చేయటంపై కూడా స్మితా సబర్వాల్‌ స్పందించారు. ఈ వ్యవహారంలో ఆయన బాధ్యత లేకుండా ఎలా రాజీనామా చేస్తారని ట్వీట్ చేశారు. అవకతవకలు తేల్చకుండా తప్పించుకోలేరంటూ సంచలన పోస్ట్ పెట్టారు. జస్ట్ ఆస్కింగ్ అంటూ తన ట్విట్టర్ వేదికగా చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతోంది. ఐఏఎస్‌ ట్వీట్‌పై  నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తన్నారు.

ఇక స్మితా సబర్వాల్‌ చేసిన ట్వీట్‌పై కొందరు మద్దతిస్తుండగా.. చాలా మంది మాత్రం విమర్శలు చేస్తున్నారు. ఆమె మాత్రం తన అభిప్రాయానికి కట్టుబడి ఉండటమే కాక.. ఈ ట్వీట్‌పై స్పందిస్తూ కామెంట్స్‌ చేసిన వారికి రిప్లై కూడా ఇస్తున్నారు. ఏది ఏమైనా ఐఏఎస్‌ అధికారి అయినా స్మితా సబర్వాల్‌.. ఇలా ఏఐఎస్‌ రూల్స్‌ మీద ట్వీట్‌ చేయడం మాత్రం సంచలనంగా మారింది.

Show comments