P Venkatesh
బైక్ పై స్లోగా వెళ్లమని సూచించినందుకు ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. నెమ్మదిగా వెళ్లమన్నందుకు యువకుడు ఆ వృద్ధుడిపై దాడి చేసి కొట్టి చంపాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
బైక్ పై స్లోగా వెళ్లమని సూచించినందుకు ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. నెమ్మదిగా వెళ్లమన్నందుకు యువకుడు ఆ వృద్ధుడిపై దాడి చేసి కొట్టి చంపాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
P Venkatesh
అతివేగం ప్రమాదకరమని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తుంటారు. మితిమీరిన వేగంతో వెళ్లి ప్రమాదాలకు కారణమవుతుంటారు వాహనదారులు. రాష్ డ్రైవింగ్ తో తోటి ప్రయాణికులకు పాదాచారులకు ఇబ్బందులు కలిగిస్తుంటారు. రోడ్లపై స్టంట్స్ చేస్తూ నానా రచ్చ చేస్తుంటారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించే వారికి జరిమానాలు విధిస్తున్నప్పటికీ మార్పు రావడం లేదు. రాంగ్ సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ లకు పాల్పడుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. కొందరు బైకర్స్ రద్దీగా ఉండే రోడ్లపై రాష్ డ్రైవింగ్ చేస్తూ పాదాచారుల ప్రాణాలు తీస్తున్నారు. స్పీడుగా వెళ్లొద్దని చెప్పిన వారిపై దాడులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నగర పరిధిలో ఘోరం జరిగింది.
ఓ యువకుడు వృద్ధుడిని కొట్టి చంపాడు. స్లోగా వెళ్లమన్నందుకు వృద్ధుడి ప్రాణాలు తీశాడు. నడిరోడ్డుపై అందరు చూస్తుండగానే వృద్ధుడిపై విచక్షణారహితంగా దాడి చేసి ప్రాణాలు తీశాడు. క్షణికావేశం ప్రాణాలు తీసింది. వయసులో పెద్దవారు అని చూడకుండా కొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన అల్వాల్ లో చోటుచేసుకుంది. ఈ ఘటన గత నెల సెప్టెంబర్ 30న అల్వాల్ పీఎస్ పరిధిలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సెప్టెంబర్ 30న అల్వాల్ పీఎస్ పరిధిలో రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి ఆంజనేయులు రోడ్డు దాటుతున్నారు. ఆ సమయంలో బైక్పై వేగంగా ఓ యువకుడు, యువతితో కలిసి ఆంజనేయులు పక్కనుంచి వెళ్లారు. ఆ వేగానికి భయపడిపోయిన ఆంజనేయులు నెమ్మదిగా వెళ్లాలని సూచించారు.
ఆ మాటకే యువకుడు ఆగ్రహానికి లోనయ్యాడు. వెంటనే బైక్ రోడ్డు పక్కన నిలిపి వృద్ధుడి వైపు దూసుకొచ్చాడు. దుర్భాషలాడుతూ ఆంజనేయులుపై దాడి చేశాడు. కింద పడేసి పిడిగుద్దులు కురిపించాడు. యువకుడితో పాటు ఉన్న యువతి ఆపేందుకు ప్రయత్నించినా అతడు మాత్రం ఆగలేదు. సహనం కోల్పోయి వృద్ధుడిపై విరుచుకుపడ్డాడు. ఆ తర్వాత యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే ఈ దాడిలో ఆంజనేయులు కిందపడ్డప్పుడు రాయికి తగలడంతో తలకు బలమైన గాయమైంది. దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆ వృద్ధుడిని కేర్ హాస్పిటల్కు తీసుకెళ్లారు.
తరువాత అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. 15 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆంజనేయులు ఈనెల 14న చనిపోయాడు. ఈ ఘటనపై మృతుని కుమారుడు అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కంప్లైంట్ అందుకున్న పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుని కోసం గాలిస్తున్నారు. కాగా రాష్ డ్రైవింగ్ తో భయబ్రాంక్తులకు గురిచేస్తున్న బైకర్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని స్ధానికులు డిమాండ్ చేస్తున్నారు. మరి నెమ్మదిగా వెళ్లమన్నందుకు వృద్ధుడిపై దాడి చేసి కొట్టి చంపిన యువకుడిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.