Tirupathi Rao
Task Force Raids On Chicken Center: నాన్ వెజ్ లవర్స్ లో చికెన్ లవర్స్ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే వీళ్లు ముక్క లేకపోతే ముద్దదిగదు అంటారు. అలాంటి వారికి గుండెల్లో రాయి పడేలాంటి వార్త ఇది. ఎందుకంటే హైదరాబాద్ లాంటి మహా నగరంలో కుళ్లిన చికెన్ అమ్మేస్తున్నారు.
Task Force Raids On Chicken Center: నాన్ వెజ్ లవర్స్ లో చికెన్ లవర్స్ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే వీళ్లు ముక్క లేకపోతే ముద్దదిగదు అంటారు. అలాంటి వారికి గుండెల్లో రాయి పడేలాంటి వార్త ఇది. ఎందుకంటే హైదరాబాద్ లాంటి మహా నగరంలో కుళ్లిన చికెన్ అమ్మేస్తున్నారు.
Tirupathi Rao
నాన్ వెజ్ అంటే ఇష్టం ఉండని వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. కొందరికైతే నాన్ వెజ్ అంటే ప్రాణం. ముక్క లేనిదే ముద్ద దిగదు అనే బ్యాచే ఎక్కువ ఉంటారు. అందులోనూ చికెన్ లవర్స్ సంఖ్య మరీ ఎక్కువ. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ కు అంత డిమాండ్ ఉంటుంది. ఎన్ని కొత్త చికెన్ సెంటర్లు వచ్చినా కూడా బిజినెస్ కి మాత్రం ఢోకా ఉండదు. గతంలో అంటే పండగ రోజు తినాలి.. ఆదివారం తినాలి అనుకునేవాళ్లు ఇప్పుడు వారం, వర్జ్యంతో సంబంధం లేకుండా చికెన్ ని లాగించేస్తున్నారు. ఇంట్లో వండుకోవడమే కాకుండా.. బయట కూడా ఫుడ్ కోర్ట్స్ లో చికెన్ లో వెరైటీలు అన్నీ కుమ్మేస్తూ ఉంటారు. మీరు కూడా ఆ కోవకు చెందిన వాళ్లు అయితే మాత్రం ఈ విషయం కచ్చితంగా తెలుసుకోండి. ఎందుకంటే హైదరాబాద్ లాంటి నగరంలో నిల్వ ఉంచిన.. కుళ్లిపోయిన చికెన్ ని విక్రయిస్తున్నారు. అది కూడా అందుకోసం ప్రత్యేకంగా చికెన్ షాపును కూడా నడుపుతున్నారు. అసలు ఆ షాపు ఎక్కడ ఉంది? ఆ చికెన్ ఎవరు విక్రయిస్తున్నారు? ఎవరికి విక్రయిస్తున్నారు? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఈ కుళ్లిపోయిన చికెన్ దందా హైదరాబాద్ లోనే జరుగుతోంది. బేగంపేట్ పోలీస్ స్టేషన పరిధి ప్రకాశ్ నగర్ లో ఈ నిర్వాకం జరుగుతోంది. బాలయ్య చికెన్ సెంటర్ అనే పేరిట ఈ కుళ్లిన చికెన్ దందా చేస్తున్నారు. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఈ కుళ్లిన చికెన్ దందా గురించి పక్కా సమాచారం అందింది. వాళ్లు మున్సిపల్ హెల్త్ అధికారులతో కలిసి ఈ దాడులు నిర్వహించారు. రూపాయికి కక్కుర్తి పడి నగరవాసుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వీళ్ల పండారం బయట పడింది. దాదాపు 15 రోజుల వరకు నిల్వ ఉంచిన కుళ్లిన చికెన్ అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితోపాటు మరో 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితులు చెప్పిన విషయాలకు అధికారులకు కూడా కళ్లు బైర్లు కమ్మాయి. ఎందుకంటే ఈ కుళ్లిన చికెన్ ని కేజీ 30 నుంచి 50 రూపాయలకు విక్రయిస్తారంట. వీటిని జనతా బార్లు, కళ్లు కాంపౌండ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, చిన్న చిన్న ఫుడ్ కోర్టులకు విక్రయిస్తారని దర్యాప్తులో తేలింది. వీళ్లు ఎలాంటి కోళ్లను కోయరు. వాటి మాంసాన్ని అమ్మరు. హైదరాబాద్ సహా.. ముంబయి, చెన్నై వంటి నగరాల నుంచి చికెన్ వేస్టేజ్ ని సేకరిస్తారు. ఆ తర్వాత దానిని బార్లు, కల్లు కాంపౌండ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కి విక్రయిస్తారు. ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తి గతంలో కూడా పట్టుబడ్డాడు.
గతంలో కంటోన్మెంట్, రసూల్ పురలో ఇలాగే కుళ్లిన చికెన్ విక్రయించాడు. స్థానికుల ఫిర్యాదుతో అక్కడ దుకాణం మూసేశాడు. మళ్లీ ప్రకాశ్ నగర్ లో ఇలా దందా స్టార్ట్ చేశాడు. ఇప్పుడు నార్త్ జోన్ పోలీసులు పక్కా సమాచారంతో ఈ కుళ్లిన చికెన్ దందాను మూసేశారు. ఇతనిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నగరవాసులు ఈ విషయం తెలుసుకుని బెంబేలెత్తిపోతున్నారు. బయట చికెన్ తినాలి అంటేనే.. భయంతో వణికిపోతున్నారు. కనీసం ఇప్పటికైనా అసలు విషయం తెలుసింది అంటూ ఊపిరిపీల్చుకుంటున్నారు. మరి.. ఈ కుళ్లిన చికెన్ దందాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.