P Venkatesh
అల్లం వెల్లుల్లి పేస్టును బయట కొంటున్నారా? అయితే మీ ఆరోగ్యం డేంజర్ లో పడినట్టే. హైదరాబాద్ లో కల్తీ అల్లం పేస్ట్ తయారీ కలకలం రేపింది. ప్రమాదకర రసాయనాలతో అల్లం వెల్లుల్లి పేస్టు తయారు చేస్తూ టాస్క్ ఫోర్స్ అధికారులకు దొరికిపోయారు.
అల్లం వెల్లుల్లి పేస్టును బయట కొంటున్నారా? అయితే మీ ఆరోగ్యం డేంజర్ లో పడినట్టే. హైదరాబాద్ లో కల్తీ అల్లం పేస్ట్ తయారీ కలకలం రేపింది. ప్రమాదకర రసాయనాలతో అల్లం వెల్లుల్లి పేస్టు తయారు చేస్తూ టాస్క్ ఫోర్స్ అధికారులకు దొరికిపోయారు.
P Venkatesh
పాలు, నూనే, ఇతర వంట పదార్థాలు కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొందరు వ్యక్తులు. డబ్బు సంపాదనే లక్ష్యంగా కల్తీ వ్యాపారానికి తెరలేపుతున్నారు. కల్తీ ఆహార పదార్థాలతో అనారోగ్యాల బారిన పడుతున్నారు ప్రజలు. ప్రభుత్వాలు కల్తీ వ్యాపారులపై చర్యలు తీసుకుంటున్నప్పటికీ అడ్డుకట్ట పడడం లేదు. రోజు రోజుకు కల్తీ వ్యాపారుల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. ఈ క్రమంలో మరో దారుణం వెలుగుచూసింది. సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్‌పల్లిలో అల్లం వెల్లుల్లి పేస్టును ప్రమాదకరమైన రసాయనాలతో తయారు చేస్తున్నారు. కల్తీ అల్లంపేస్ట్ తయారీ కేంద్రంలో టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులతో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో అల్లంకు బదులు ప్రమాదకరమైన సిట్రిక్ యాసిడ్, ఉప్పు, పసుపు, వెల్లుల్లి వినియోగిస్తూ తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అల్లం వెల్లుల్లు పేస్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అన్ని రకాల వంటల్లో అల్లం వెల్లుల్లిని వాడుతుంటారు. అయితే అల్లం వెల్లుల్లిని బయట తీసుకుని ఇంట్లోనే తయారు చేసుకునే వారు. రోళ్లలో అప్పటికప్పుడు నూరుకుని వాడుకునే వారు. ఆ తర్వాత మిక్సీల్లో అల్లం వెల్లుల్లి పేస్టును తయారు చేసుకోవడం ప్రారంభించారు. కాగా కొందరు అల్లం వెల్లుల్లి పేస్టును ఇంట్లో తయారు చేసుకునేందుకు సమయం లేకపోవడంతో మార్కెట్ లో ఇన్ స్టంట్ గా దొరికే అల్లం పేస్ట్ పై ఆధారపడుతున్నారు.
తక్కువ ధరలోనే అల్లం పేస్టు డబ్బాలు లభిస్తుండడంతో వీటి కొనుగోలుకే మొగ్గు చూపుతున్నారు. కానీ తక్కువ ధరలోనే ఇంటికి అనారోగ్యాన్ని ఆహ్వానిస్తున్నామనే విషయాన్ని మర్చిపోతున్నారు. కల్తీ అల్లం పేస్టును వాడుతూ ఆరోగ్యాన్ని డేంజర్ లో పడేసుకుంటున్నారు. ఇలాంటి వారిని ఆసరగా చేసుకుని కల్తీ వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నారు. లాభాలే లక్ష్యంగా కల్తీ అల్లం తయారీకి తెరలేపుతున్నారు. ఇదే విధంగా ఓల్డ్ బోయిన్ పల్లిలో రాజరాజేశ్వరి నగరల్ లో మహ్మద్ షఖీల్ అహ్మద్ సోనీ జింజర్ గార్లిక్ పేస్ట్ పేరిట వ్యాపారం నిర్వహిస్తున్నారు. ప్రమాదకరమైన పదార్థాలను కలుపుతూ అల్లం పేస్టు తయారు చేస్తున్నారు.
నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని ప్రముఖ హోటళ్లకు కూడా ఈ నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను సరఫరా చేస్తున్నారు. మూడు సంవత్సరాలుగా సాగుతున్న ఈ కల్తీ వ్యాపారంపై ఫిర్యాదులు రావడంతో బోయిన్పల్లి ఇన్‌స్పెక్టర్ లక్ష్మీ నారాయణరెడ్డి, టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ సైదులు, తనిఖీలు చేపట్టారు. దాడుల్లో ఏకంగా 1500 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. కల్తీ అల్లం తయారు చేస్తున్న 8 మందిని అరెస్ట్ చేసినట్లు టాస్క్‌ఫోర్స్ అధికారులు తెలిపారు. కల్తీ అల్లం పేస్ట్ తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.