గూని బాధితులకు నిమ్స్ శుభవార్త.. రూ.12 లక్షలు ఖర్చయ్యే సర్జరీ రూ.లక్షకే..

Scoliosis surgeries: గూని బాధితులకు గుడ్ న్యూస్. హైదరాబద్ నిమ్స్ లో రూ. 12 లక్షల సర్జరీ కేవలం రూ. లక్షకే అందుబాటులో ఉంది. గూనితో బాధపడుతున్నవారికి ఇది సువర్ణావకాశం.

Scoliosis surgeries: గూని బాధితులకు గుడ్ న్యూస్. హైదరాబద్ నిమ్స్ లో రూ. 12 లక్షల సర్జరీ కేవలం రూ. లక్షకే అందుబాటులో ఉంది. గూనితో బాధపడుతున్నవారికి ఇది సువర్ణావకాశం.

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నా ఆరోగ్యం బాలేకపోతే జీవితం నరకంగా ఉంటుంది. అందుకే అందరు ఆరోగ్యంపై దృష్టిసారిస్తున్నారు. మారిన జీవన శైలి మానవులను అనారోగ్యాలపాలు చేస్తున్నది. పలురకాల వ్యాధులు మానవులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కొన్ని రకాల ధీర్ఘకాలిక వ్యాధులు మానవులను వెంటాడి వేధిస్తున్నాయి. అయితే కొంత మంది పుట్టుకతోనే గుండె జబ్బులు, వైకల్యం, దృష్టిలోపం ఇలా పలు అనారోగ్య సమస్యలతో జన్మిస్తుంటారు. మరికొంతమంది పుట్టుకతోనే గూని జబ్బుల బారిన పడతారు. వెన్నెముకలో అమరికలు సక్రమంగా లేకపోవటం వల్ల చిన్నతనంలోనే కొందరికి పార్శ్వగూని ప్రారంభమవుతుంది.

కొందరికి వంశపారంపర్యంగా పార్శ్వ గూని(స్కోలియోసిస్‌) బారిన పడే అవకాశం ఉంటుంది. గూని కారణంగా వారు జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. సమాజంలో చిన్నచూపుకు గురవుతుంటారు. గూని సమస్య జీవితాంతం వేధిస్తూ ఉంటుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే సర్జరీ చేయించుకోవాల్సిందే. గూని చికిత్స చేయించుకోవాలంటే లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే అంత పెద్ద మొత్తంలో వైద్య ఖర్చులు భరించడం అందరికీ సాధ్యం అయ్యే పనికాదు. ఇలాంటి వారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో తక్కువ ఖర్చుతో వైద్యం చేయించుకోవాలని చూస్తుంటారు. ఎవరైతే గూని సమస్యతో బాధపడుతున్నారో అలాంటి వారికి హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి శుభవార్తను అందించింది.

గూని సర్జరీకి దాదాపు 8 లక్షల నుంచి 12 లక్షల వరకు అవుతుంది. అయితే నిమ్స్ లో మాత్రం కేవలం రూ. లక్షకే గూని సర్జరీ చేస్తున్నారు. గూని బాధితులకు ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్య చికిత్సలు అందిస్తున్నారు అక్కడి వైద్యులు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ప్రతి ఏడాది 100 వరకు స్కోలియోసిస్‌ సర్జరీలు జరుగుతుండగా.. ఒక్క నిమ్స్ ఆర్థోపెడిక్ విభాగంలోనే 90 సర్జరీలు చేస్తున్నారు. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఒక్కో సర్జరీకి రూ.8 లక్షల నుంచి 12 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు.

నిమ్స్‌లో మాత్రం కేవలం రూ.లక్షకే సర్జరీ చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ ఉంటే ఆయా రోగులకు ఉచితంగా గూని సర్జరీ చేస్తున్నట్లు నిమ్స్ వైద్యులు చెబుతున్నారు. చాలా క్లిష్టమైన పార్శ్వగూని సర్జరీలను నెలకు 8 నుంచి 10 వరకు చేస్తున్నట్లు నిమ్స్‌ ఆర్థోపెడిక్స్‌ విభాగాధిపతి డాక్టర్‌ నగేశ్‌ చెరుకూరి వెల్లడించారు. నిమ్స్‌లో సర్జరీలు చేసుకున్న చాలామంది ప్రస్తుతం సాధారణ జీవితం గడుపుతున్నట్లు వెల్లడించారు. మరి నిమ్స్ లో రూ. లక్షకే గూని సర్జరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments