Arjun Suravaram
Rain Alert In Hyderabad: హైదరాబాద్ నగరాన్ని వాన మబ్బులు కమ్మేశాయి. మరికాసేపట్లో నగరాన్ని భారీ వాన పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నాారు.
Rain Alert In Hyderabad: హైదరాబాద్ నగరాన్ని వాన మబ్బులు కమ్మేశాయి. మరికాసేపట్లో నగరాన్ని భారీ వాన పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నాారు.
Arjun Suravaram
రెండు తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురిశాయసి. ఇక శనివారం ఉదయం నుంచి అయితే వరుణుడు హైదరాబాద్ పై తన ప్రతాపం చూపిస్తున్నాడు. తెల్లవారు జాము నుంచి గ్యాప్ ఇవ్వకుండా ముసురు వాన పడుతూనే ఉంది. దీంతో ఆఫీసులకు, ఇతర పనులమీద బయటకు వెళ్లిన వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ ముసురు వానతోనే అల్లడిపోతున్న నగరవాసులకు మరో హై అలెర్ట్ వచ్చింది. శనివారం సాయంత్రం నగరమంతా వాన మబ్బులు కమ్మేశాయి. మరికాసేపట్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు హైదరాబాద్‌లో శనివారం ఉదయం నుంచి వానలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో వర్షం కాస్తా గ్యాప్ ఇచ్చింది. అయితే సాయంత్రానికి హైదరాబాద్ నగరాన్ని వాన మేఘాలు కమ్ముకున్నాయి. పగలే రాత్రిగా హైదరాబాద్ నగరంలో చీకట్లు కమ్ముకున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం హైదరాబాద్ వ్యాప్తంగా చల్లటి వాతావరణ కనిపిస్తోంది. రాబోయే 24 గంటల్లో హైదరాబాద్ తో సహా తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారతీయ వాతావరణ శాఖ తెలిపింది. నేడు, రేపు భారీ వర్షాలు కురిసే సూచన ఉండటంతో రాష్ట్రానికి ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
ఇక హైదరాబాద్ కు ఐఎండీ అలెర్ట్ చేసింది. ఎవరు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. అలానే ఆఫీస్ లో ఉన్నవాళ్లు..అవకాశం ఉంటే..వీలైనంత త్వరగా ఇళ్లకు చేరుకోవడం మంచిది. ఇప్పటికే నగరంలో కురిసిన వానకు పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అలెర్ట్ గా ఉండాలని అధికారుల హెచ్చరించారు.
కాగా, అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారేందుకు మరో 24 గంటల పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.