Dharani
IMD Alert Heavy Rain In Hyderabad: హైదరాబాద్ నగరంలో జోరు వాన కురుస్తోంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు కీలక అలర్ట్ జారీ చేశారు. ఆ వివరాలు..
IMD Alert Heavy Rain In Hyderabad: హైదరాబాద్ నగరంలో జోరు వాన కురుస్తోంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు కీలక అలర్ట్ జారీ చేశారు. ఆ వివరాలు..
Dharani
హైదరాబాద్ నగరాన్ని జోరు వానలు వీడటం లేదు. సోమవారం మధ్యాహ్నం నుంచే కుండపోత వాన కురుస్తుంది. సోమవారం మధ్యాహ్నం నగరంలో ఉన్నట్లుండి వాతావరణం మారిపోయింది. కారు మబ్బులు కమ్ముకుని.. పట్టపగలే కటిక చీకట్లు అలుముకున్నాయి. నిమిషాల వ్యవధిలోనే కుండపోత వాన కురిసింది. ఇక సోమవారం మధ్యాహ్నం ప్రారంభమైన వాన ఇప్పటికి కూడా వీడటం లేదు. అర్థరాత్రి నుంచి ముసురు, జోరువాన కొనసాగగా.. మంగళవారం తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఎడతెరపిలేకుండా భారీ వర్షం కురిసింది. పరిస్థితి చూస్తే.. క్లౌడ్ బరస్ట్ అయ్యిందేమో అన్నట్లుగా ఉంది. భారీ వర్షం నేపథ్యంలో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యి కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి.
హైదరాబాద్ నగరంలోని బషీర్ బాగ్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, షేక్ పేట, మెహదీపట్నం, హిమాయత్ నగర్, దిల్‌సుఖ్ నగర్, మలక్ పేట, వనస్థలిపురం, ఉప్పల్, ఫిల్మ్ నగర్.. నారాయణగూడ, పంజాగుట్ట, ఖైరతతాబాద్ ఎర్రమంజిల్, లక్డికాపుల్ ఏరియాల్లో భారీ వర్షం పడుతుంది. దీంతో రోడ్లు మెుత్తం జలమయం అయ్యాయి.
భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలని సూచించారు. రోడ్లపై భారీగా వరద నీరు చేరటంతో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయే ప్రమాదం ఉందని.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. మంగళవారం ఉదయం ఆఫీసులకు వెళ్లేవారు, స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు మ్యాన్‌హోల్స్‌ను గమనించాలని సూచించారు. ఏదైనా అత్యవసరమైతే జీహెచ్‌ఏంసీ అధికారులను సంప్రదించాలని కోరారు.
ఇక నేడు నగరంలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి రుతు పవనాలు ఇంకా చురుగ్గానే ఉండటం.. రాయలసీమ మీద తుపాను సుడిగుండం కేంద్రీకృతం కావటం, ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయన్నారు. నేటి నుంచి మరో మూడ్రోజుల పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇక మంగళవారం ఉదయం, సాయంత్రం వేళ ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. కాసేపటికి హైదరాబాద్‌లో వర్షం ఆగిపోయినా… మధ్యాహ్నం తర్వాత మళ్లీ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని జనాలు దీన్ని గమనించి తమ పనులను చూసుకోవాలని అధికారులు తెలిపారు. నేడు రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, సిద్దిపేట, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.