రేవంత్ కొత్త ప్లాన్!.. మూసి పరివాహక ప్రాంతాల్లో వెనక్కు తగ్గిన హైడ్రా..

HYDRA Demolitions: ప్రస్తుతం హైదరాబాద్ లో హైడ్రా దూకుడు ఏ రకంగా చలామణి అవుతుందో.. తెలియనిది కాదు. అయితే ఇప్పుడు మూసి ప్రరివాహక ప్రాంతాల్లో మాత్రం కాస్త వెనక్కు తగ్గినట్లు అనిపిస్తుంది. దానికి సంబంధించిన పూర్తి విషయాలు చూసేద్దాం.

HYDRA Demolitions: ప్రస్తుతం హైదరాబాద్ లో హైడ్రా దూకుడు ఏ రకంగా చలామణి అవుతుందో.. తెలియనిది కాదు. అయితే ఇప్పుడు మూసి ప్రరివాహక ప్రాంతాల్లో మాత్రం కాస్త వెనక్కు తగ్గినట్లు అనిపిస్తుంది. దానికి సంబంధించిన పూర్తి విషయాలు చూసేద్దాం.

మూసి నది పరివాహక ప్రాంతాల్లో హై టెన్షన్ అంటూ… పలు వార్తలు చూశాం. కానీ ఇప్పుడు ఆ ప్రాంతాల్లో కూల్చివేతలపై ప్రభుత్వం వెనక్కు తగ్గిందా! మిగతా అన్ని ప్రాంతాల్లో దూసుకుపోయిన హైడ్రా బుల్డోజర్లకు ఇక్కడ బ్రేక్ పడిందా! ఎట్టకేలకు నివాసితులను బుజ్జగించి పంపించాలనే నిర్ణయానికి వచ్చిందా!. గత రెండు రోజులుగా చూస్తున్న పరిస్థితులని బట్టి చూస్తే మాత్రం ఈ ప్రశ్నలకు సమాధానం అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే, సరిగ్గా ఆగస్ట్ 24న ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలతో హైడ్రా దూకుడు మొదలైంది. ఇక ఆ తర్వాత హైడ్రా హై స్పీడ్ పెంచిన సంగతి తెలిసిందే. బఫర్ జోన్ పరిధిలో ఎక్కడ భవనాలు కనిపించినా క్షణాల్లో నేల మట్టం చేస్తూ వస్తున్నాయి. పలు వర్గాల వారు దీనిని సమర్ధించారు కూడా.. భవిష్యత్తులో ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ఉండడానికి ఇదే సరైన పద్దతి అన్నారు. కానీ సామాన్యులకు మాత్రం గుండెల్లో గుబులు పెంచింది. కొండత ఆశలతో కట్టుకున్న ఇల్లు కళ్ళ ముందు కుప్పకూలిపోతుంటే.. కంటతడి పెట్టని సామాన్యుడు లేడు. దీనితో ప్రభుత్వం ఈ విషయంలో కాస్త వెనక్కు తగ్గినట్లుగా అనిపిస్తుంది. దానికి సంబంధించిన పూర్తి విషయాలు చూసేద్దాం.

కొన్ని ఏళ్ళ క్రితం స్థలాలు కొనుక్కొని.. అన్ని రకాలా అనుమతులు తీసుకుని.. ఇల్లు నిర్మించుకున్న తర్వాత.. ఇప్పుడు ఇలా ఉన్నపలంగా ఖాళీ చేయాలంటే ఎలా అంటూ.. ప్రతి గొంతు రేవంత్ సర్కార్ ను ప్రశ్నిస్తుంది. వచ్చిన హైడ్రా ను వెనకడుగేలా చేస్తున్నారు ప్రజలు. వారు ఇచ్చే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు అవసరం లేదంటూ తేల్చి చెప్పేస్తున్నారు. ఇప్పటివరకు దానికి సంబంధించిన ఎన్నో వీడియోస్ మీడియా సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము. ఈ క్రమంలో గత వారం హైడ్రా బుల్డోజర్స్ మూసి పరివాహక ప్రాంతాలను టార్గెట్ చేశాయి. అక్కడ ప్రతి ఇంటికి మార్కింగ్ కూడా చేశారు అధికారులు. ఇక ఏ క్షణానైనా అక్కడ కూల్చివేతలు చేపట్టొచ్చని అనుకున్నారు. కానీ తీరా ఇక్కడ మాత్రం హైడ్రా బుల్డోజర్లు వెనక్కు తగ్గాయి. నిన్నటి నుంచి అక్కడ ఎలాంటి చడీ చప్పుడు లేదు. ఎట్టి పరిస్థితిలోను అక్కడ ప్రజలు బెదిరించొద్దని.. వారితో దురుసుగా ప్రవర్తించవద్దని.. ఒకవేళ ప్రజలు ఏమైనా కఠినంగా మాట్లాడినా వారిని ఏమి అనవద్దని.. రేవంత్ సర్కార్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వారిని బెదిరించి కాకుండా బుజ్జగించి వారిని ఒప్పించి కూల్చివేతలు చేసే ప్లాన్ లో ఉన్నట్లు సమాచారం.

నిజమే ప్రభత్వం ఇలా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకున్నట్లే. ఎందుకంటే మూసి పరివాహక ప్రాంతాల్లో ఎంతో మంది ప్రజలు.. ఎక్కడెక్కడి నుంచో వచ్చి నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ ఒక్కో ఇళ్ళు దాదాపు 50 లక్షల నుంచి కోటి రూపాయలు వరకు పలుకుతుంది. కాబట్టి అక్కడి వారిని ఖాళీ చేయించాలంటే ప్రభుత్వం ఎక్కువ పరిహారమే ఇవ్వాలి. అక్కడ ప్రజలను సామరస్యంగా ఎలా పంపించాలి. అలాగే వారు కూల్చివేతలకు ఒప్పుకోవాలంటే ఎంత పరిహారం చెల్లించాలి. అనే విషయాలపై ప్రస్తుతం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు త్వరలోనే ప్రకటించనున్నారు అధికారులు. మరి ఈసారి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments