Hyderabadలో వందెకరాల భూమి అమ్మేస్తున్న టెక్‌ మహీంద్రా.. వందల కోట్ల డీల్..!

Hyd, Tech Mahindra To Sell Land: హైదరాబాద్‌లో అతి పెద్ద ల్యాండ్‌ డీలింగ్‌ జరిగింది. ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ వందల ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టింది. ఆ వివరాలు..

Hyd, Tech Mahindra To Sell Land: హైదరాబాద్‌లో అతి పెద్ద ల్యాండ్‌ డీలింగ్‌ జరిగింది. ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ వందల ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టింది. ఆ వివరాలు..

రకరకాల కంపెనీలు, పరిశ్రమల ఏర్పాటుతో లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ.. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది హైదరాబాద్‌. ఇక భాగ్యనగరం అనగానే పరిశ్రమలు, ఎంఎన్‌సీ కంపెనీలు ఎలా గుర్తుకు వస్తాయో.. రియల్‌ ఎస్టేట్‌ అడ్డా అని కూడా చెప్పొచ్చు. నగరంలో భూముల ధరలు చుక్కలను తాకుతుంటాయి. గజం విలువే లక్షల రూపాయలు ఉంటుంది. ఇక భాగ్యనగరంలో భూమి కొన్నారంటే ఐశ్వర్యవంతులు అని చెప్పవచ్చు. సింగిల్‌ బెడ్రూమ్‌ ఇల్లు కట్టేంత జాగా కావాలంటే లక్షలు.. ఇక కొన్ని ప్రాంతాల్లో అయితే కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు ధీటుగా హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ నడుస్తోంది. ఇక గత ఏడాది కోకాపేటలో ఎకరం భూమి ఏకంగా 100 కోట్ల రూపాయలు పలికిన సంగతి తెలిసిందే. ఇక నగరంలో నిత్యం వందల కోట్ల రూపాయల రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీలు జరుగుతుంటాయి. ఇక తాజాగా ఓ ఐటీ దిగ్గజం అతిపెద్ద డీల్‌ చేసుకుంది. ఆ వివరాలు..

హైదరాబాద్‌లో అతిపెద్ద రియల్‌ ఎస్టేట్‌ డీల్‌ చేసుకుంది ఐటీ దిగ్గజం టెక్‌ మహీంద్రా కంపెనీ. వందల ఎకరాల భూమి, కార్యాలయాలను అమ్మేందుకు రెడీ అయ్యింది. ఈ డీల్‌ విలువ వందల కోట్ల రూపాయలు ఉండటం గమనార్హం. టెక్‌ మహీంద్రా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది అంటే..

ఐటీ దిగ్గజం టెక్‌ మహీంద్రా.. హైదరాబాద్ గండిమైసమ్మ దగ్గర బహదూర్‌పల్లిలో కంపెనీ పేరు మీద విస్తరించి ఉన్న 103 ఎకరాల భూమిని టెక్ మహీంద్రా రూ. 535 కోట్లకు విక్రయించేందుకు డీల్ చేసుకుంది. ఇందులోనే సుమారు 1.26 మిలియన్ చదరపు అడుగుల మేర విస్తరించి ఉన్న 17 బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. ఆగస్ట్ 20న దీనికి సంబంధించి ఒప్పందం ఖరారైంది. అయితే ఈ డీల్‌ను మహీంద్రా యూనివర్సిటీతోనే కుదుర్చుకోవడం విశేషం.

ఇక ఈ డీల్‌ విలువ రూ. 535 కోట్లు కాగా.. దీనిపై అదనంగా ట్యాక్సులు, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు, కన్వర్షన్ ఛార్జీలు, ఇంకా వర్తించే ఏవైనా ఛార్జీలు కూడా ఉన్నాయి. ఇక ఈ మొత్తాన్ని ఏకకాలంలో కాకుండా.. నాలుగేళ్లలో చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకు ఇరుపార్టీలు అంగీకరించాయి. ఈ మొత్తంపై ఏడాదికి 8.20 శాతం వడ్డీ రేటుతో చెల్లించేందుకు ఒప్పుకున్నాయి. ఈ మేరకు టెక్ మహీంద్రా.. ఎక్స్చేంజి ఫైలింగ్‌లో వెల్లడించింది.

మహీంద్రా యూనివర్సిటీని సమాజ అభివృద్ధిపై దృష్టి సారించే స్వయం ప్రతిపత్త సంస్థగా ఏర్పాటు చేయడమే ఈ విక్రయం వెనుక లక్ష్యమని టెక్ మహీంద్రా తెలిపింది. తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్-2018 అనుగుణంగా స్థాపించిన విశ్వవిద్యాలయం మహీంద్రా యూనివర్సిటీ. ఇక దీనికి మహీంద్రా ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ స్పాన్సరింగ్ బాడీగా ఉంది.

Show comments