Hyderabad: గర్ల్‌ఫ్రెండ్‌తో OYOకు వెళ్తున్నారా.. అయితే మీ వీడియోలు వారి చేతుల్లోకి!

HShamshabad OYO Hotel Owner Arrested: లవర్‌తో కలిసి ఓయో రూమ్‌కి వెళ్లి ఎంజాయ్‌ చేయాలని భావిస్తున్నారా.. అయితే ఒక్కసారి ఈ వార్త చదవండి.. ఆ తర్వాత డిసైడ్‌ చేసుకొండి.

HShamshabad OYO Hotel Owner Arrested: లవర్‌తో కలిసి ఓయో రూమ్‌కి వెళ్లి ఎంజాయ్‌ చేయాలని భావిస్తున్నారా.. అయితే ఒక్కసారి ఈ వార్త చదవండి.. ఆ తర్వాత డిసైడ్‌ చేసుకొండి.

ఒకప్పుడు ఇంట్లో ఏకాంతం దొరకని పెళ్లైన కొత్త దంపతులు.. హోటల్‌కి వెళ్లి కాస్త సమయం గడిపి వచ్చేవారు. లేదంటే పార్కులకు వెళ్లేవారు. ఇక రాను రాను ఈ ట్రెండ్‌ మారింది. పబ్లిక్‌ పార్కులకి వచ్చే లవర్స్‌ సంఖ్య విపరీతంగా పెరిగింది. వీళ్లలో చాలా మంది తాము బహిరంగ ప్రదేశాల్లో ఉన్నమన్న సోయి కూడా మర్చిపోయి.. విచ్చలవిడిగా ప్రవర్తించేవారు. నలుగురు చూస్తారన్న ధ్యాస లేకుండా పబ్లిక్‌గా రొమాన్స్‌ చేస్తుంటారు. నేటికి కూడా నగరంలో కొన్ని పార్కుల పేరు చెబితే లవర్స్‌ పార్క్‌ అనే అంటారు. ఆ పార్కులకు వెళ్లామంటే మనల్ని విచిత్రంగా చూస్తారు. ఇక ఇప్పుడు ఆ పార్కుల స్థానంలో ఓయో రూమ్స్‌‌ వచ్చేశాయి. లవర్‌తో ఎంజాయ్‌ చేయాలనుకునే వారికి ఇప్పుడు ఇవే బెస్ట్‌ ఆప్షన్‌ అన్నట్లుగా మారాయి. మరి మీరు కూడా ఇదే ఆలోచనలో ఉన్నారా.. అయితే ఈ వార్త చదివాక మీ నిర్ణయాన్ని కచ్చితంగా మార్చుకుంటారు. ఎందుకో తెలియాలంటే చదవండి.

గర్ల్‌ఫ్రెండ్‌తో సరదాగా కాసేపు గడుపుదామని ఓయో రూమ్‌కి వెళ్తున్నారా.. అయితే మీ ఏకాంత వీడియోలు లీక్‌ అయ్యే అవకాశం ఉంది. తాజాగా శంషాబాద్‌లో ఈ తరహా ఘటన వెలుగు చూసింది. హోటల్‌ గదిలో సీక్రెట్‌ కెమరా ఏర్పాటు చేశాడు హోటల్‌ యజమాని. ఎవరైనా ఈ హోటల్లో రూమ్‌ రెంట్‌కి తీసుకుని.. లోపల రొమాన్స్‌ చేస్తే.. వారి వీడియోలు చిత్రీకరించి.. ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడుతున్నాడు. మరి ఇప్పటి వరకు సదరు హోటల్‌ నిర్వహాకుడు ఎంత మందిని బెదిరించాడో తెలియదు కానీ.. తాజాగా ఓ జంట.. ఈ హోటల్‌ ఓనర్‌ బెదిరింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించడంతో.. ఈ చీకటి బాగోతం వెలుగులోకి వచ్చింది.

బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన శంషాబాద్‌ పోలీసులు.. సదరు హోటల్‌కి వెళ్లి చెక్‌ చేయగా.. రూమ్‌లో సీక్రెట్‌ కెమరాలు ఫిక్స్‌ చేసి ఉన్నాయి. వాటిని గుర్తించిన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలానే నిందితుడి వద్ద నుంచి రెండు మొబైల్‌ ఫోన్లను కూడా సీజ్‌ చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడిని ఒంగోలు చెందిన గణేష్‌ అనే వ్యక్తిగా గుర్తించారు. మీరు కూడా లవర్‌తో ఇలా ఓయో రూమ్‌లకు వెళ్లాలని భావిస్తే.. మరోసారి ఆలోచించుకొండి. లేదంటే మీ వీడియోలు లీక్‌ చేసి.. మిమ్మల్ని బ్లాక్‌మెయిల్‌ చేసేందుకు అవకాశం ఉంది.

Show comments