P Venkatesh
హైదరాబాద్ నగరంలో ఓ హార్డ్ వేర్ ఇంజినీర్ జీవితంలో చీకట్లు నింపింది కరెంట్ పోల్. చిన్న పని మీద బయటికి వెళ్లిన అతను ప్రమాదవశాత్తు కరెంట్ పోల్ కు తగలడంతో విద్యుత్ షాక్ కు గురై ప్రాణాలు కోల్పోయాడు.
హైదరాబాద్ నగరంలో ఓ హార్డ్ వేర్ ఇంజినీర్ జీవితంలో చీకట్లు నింపింది కరెంట్ పోల్. చిన్న పని మీద బయటికి వెళ్లిన అతను ప్రమాదవశాత్తు కరెంట్ పోల్ కు తగలడంతో విద్యుత్ షాక్ కు గురై ప్రాణాలు కోల్పోయాడు.
P Venkatesh
ప్రమాదం ఎప్పుడు ఎలా ముంచుకొస్తుందో ఊహించలేము. ఆకస్మాత్తుగా చోటుచేసుకునే ప్రమాదాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తాయి. అప్పటి వరకు తమతో ఉన్నవారు ఒక్కసారిగా తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుంటారు. రోడ్డు ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు, ఆరోగ్య సమస్యల వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలో ఓ కరెంట్ పోల్ హార్డ్ వేర్ ఇంజినీర్ ప్రాణం తీసింది. కుటుంబంతో హ్యాపీగా సాగిపోతున్న తన జీవితం కరెంట్ పోల్ వల్ల ముగుస్తుందని అతడు ఊహించలేకపోయాడు. మృతుడు పని మీద బయటికి వెళ్లిన క్రమంలో కృష్ణ నగర్ ప్రధాన దారిలో వీధి దీపాల స్తంబానికి చేయి తగలడంతో విద్యుత్ సరఫరా అయి అక్కడికక్కడే మృతిచెందాడు.
హార్డ్‌వేర్ ఇంజినీర్ కుటుంబంలో కరెంట్ పోల్ విషాదాన్ని నింపింది. ఏ తప్పు చేయకున్నా అతడు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. పని మీద బయటకు వెళ్లిన ఓ హార్డ్వేర్ ఇంజనీర్‌ని మృత్యువు కరెంట్ షాక్ రూపంలో కబలించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా గుమ్మడి కుంట్ల గ్రామానికి చెందిన తుమ్మ భావన ఋషి (35) గత పది సంవత్సరాలుగా హైదరాబాదు నగరంలోని కృష్ణానగర్‌లో నివాసం ఉంటున్నారు. నగరంలోనే హార్డ్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే నిన్న రాత్రి సమయంలో భావన ఋషి బయటకు వెళ్లగా విద్యుత్ రూపంలో మృత్యువు వెంటాడింది.
కృష్ణ నగర్ ప్రధాన దారిలో వీధి దీపాల స్తంభానికి విద్యుత్ సరఫరా తీగలు ఉన్నాయి. హార్డ్ వేర్ ఇంజినీర్ తుమ్మ భావన ఋషి (35) స్తంభం పక్క నుండి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ సమయంలో భావన ఋషి చెయ్యి ప్రమాదవశాత్తు స్తంభానికి తగిలింది. దీంతో అతడు ఒక్కసారిగా కరెంట్ షాక్ కు గురయ్యాడు. దీంతో భావన ఋషి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అతడి మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తన భర్త మృతి చెందాడంటూ మృతుడి భార్య సుజాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.