విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త.. ఇకపై ఆ విషయంపై మరింత ఫోకస్!

Good News for Students: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా విద్య వ్యవస్థపై ప్రత్యేర దృష్టి సారిస్తున్నారు.

Good News for Students: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా విద్య వ్యవస్థపై ప్రత్యేర దృష్టి సారిస్తున్నారు.

గత ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చింది. సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పరిపాలనలో తనదైన మార్క్ చాటుకుంటున్నారు. పలు విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఆరు గ్యారెంటీ పథకాల్లో మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ, 200 ఉచిత కరెంట్, రూ.500 గ్యాస్ సిలిండర్ లాంటి పథకాలు ప్రారంభించారు. త్వరలో అర్హులైన మహిళలకు రూ.2500 ఇవ్వనున్నట్లు ప్రకటించారు. విద్య, వైద్య, వ్యవసాయ, మహిళా సంక్షేంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ పాఠశాలల పరిశుభ్రతపై ప్రభుత్వం మరింత ఫోక్ పెట్టినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే పాఠశాలల పరిశుభ్రతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించింది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల పరిశ్రభుత బాధ్యతలను ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ’ కి అప్పగించింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రతపై దృష్టి సారించిన నేపథ్యంలో పారిశుద్ద్య పనుల కోసం ప్రభుత్వం గ్రాంట్ ని మంజూరు చేసింది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వం గ్రాంట్ ని రిలీజ్ చేసింది.

పది నెలలకు కలిపి ఒకేసారి ఆయా పాఠశాలలకు నిధులు మంజూరు చేసింది. 30 మందిలోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలకు రూ.3 వేల, 31 నుంచి 100 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలకు రూ.6 వేలు, 101 నుంచి 250 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలకు రూ.8 వేలు, 251 నుంచి 500 లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలకు రూ.12 వేలు, 750 విద్యార్థులకు పైగా ఉన్న పాఠశాలలకు రూ.20 వేల చొప్పన ప్రభుత్వం నిధులు మంజూరు చేయనుంది.ఇకపై పాఠశాలల్లో ఎలాంటి అపరిశుభ్ర వాతావరణం కనిపించకూడదని, పిల్లలు చక్కటి వాతావరణంలో విద్యనభ్యసించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించినా.. అపరిశుభ్ర వాతావరణం కనిపించినా వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.

Show comments